OTT Movie : హారర్ జానర్ అందరికీ ఇష్టమైనది. ఈ జానర్ లో వచ్చే దెయ్యాల సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ప్రేక్షకులు. రకరకాల స్టోరీలతో ఈ సినిమాలు ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ హారర్ సినిమాలో టిస్టులు ఎక్కువే. స్టోరీకూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఉత్కంఠంగా ముగుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఆడియెన్స్ కి ఒక చిల్లింగ్ వైబ్ ని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
మహి, సామ్ కొత్తగా పెళ్ళైన హిందూ-క్రిస్టియన్ జంట. సామ్ కొత్త ఉద్యోగం కోసం ముంబై నుండి మారిషస్‌కు వెళ్తారు. అక్కడ అతను ఒక న్యూక్లియర్ వేస్ట్ ఫెసిలిటీలో ఉన్నత స్థానంలో పనిచేస్తాడు. వీళ్ళ కొత్త ఇంటిని అలంకరించే క్రమంలో, మహి ఒక యాంటీక్ షాప్‌లో పురాతన కాలం నాటి ఒక యూదు బాక్స్‌ను కొంటుంది. దానిని ఇంటికి తీసుకెళ్తుంది. అయితే ఈ బాక్స్ తెరిచిన తర్వాత, వాళ్ళ ఇంట్లో అతీంద్రియ సంఘటనలు జరుగుతాయి. మహి వింతైన దృశ్యాలు చూస్తుంది. ఒక ఆడ దెయ్యం ఆమెను వెంటాడుతుంది. మహిప్రవర్తన కూడా విపరీతంగా మారుతుంది. ఈ బాక్స్ ఒక దుష్ట ఆత్మను కలిగి ఉందని తెలుస్తుంది. ఇది మహి గర్భవతిగా ఉన్నందున ఆమె గర్భంలోని శిశువును ఆవహించడానికి ప్రయత్నిస్తుంది. సామ్, ఫాదర్ గాబ్రియేల్ సహాయంతో, ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలుపెడతాడు.
ఈ ఆత్మ అబ్రహాం, నోరా అనే జంట ప్రేమకు సంబంధించినదని తెలుస్తుంది. అబ్రహాం ఒక ఫ్రెంచ్ యూదు కుమారుడు. అతను నోరాను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ అతని తండ్రి ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తాడు. గర్భవతిగా ఉన్న నోరా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆతరువాత ఆమె కుటుంబంలోని వాళ్ళు అబ్రహామ్‌ను కొట్టి చంపుతారు. అబ్రహాం తండ్రి, యూదు మాంత్రిక విద్యను ఉపయోగించి, అబ్రహామ్ ఆత్మను ఒక బాక్స్‌లో బంధిస్తాడు. ఇది సామ్ చేతిలో పడ్డాక పరిస్థితి ఇలా మారుతుంది. ఈ ఆత్మ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉంటుంది. సామ్, మహి ఒక బ్లాక్ మ్యాజిక్ తో ఈ ఆత్మని వెళ్ళగొట్టాలని చూస్తారు.
ఈ సమయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఈ ఆత్మ మహిని కాకుండా సామ్‌ను ఆవహించినట్లు తెలుస్తుంది. ఈ ఆత్మ సామ్ ద్వారా న్యూక్లియర్ ఫెసిలిటీని నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ రకంగా తన రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. అయితే క్లైమాక్స్ ఎవరూ ఉహించని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి ఈ ఆత్మ రివేంజ్ తీర్చుకుంటుందా ? సామ్ దీని నుంచి బయటపడతాడా ? బ్లాక్ మ్యాజిక్ తో ఈ ఆత్మని అంతం చేస్తారా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘Dybbuk: The Curse Is Real’ జే కే దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ సూపర్ నాచురల్ హారర్ చిత్రం. ఇది 2017 మలయాళ చిత్రం Ezra కి రీమేక్. T-Series, Panorama Studios నిర్మించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ (సామ్), నికితా దత్తా (మహి), మనవ్ కౌల్ (రబ్బి మార్కస్), ఇమాదుద్దీన్ షా (అబ్రహాం ఎజ్రా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021అక్టోబర్ 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. IMDbలో 5.1/10 రేటింగ్ ను పొందింది.
Read Also : అర్ధరాత్రి హఠాత్తుగా ఊడిపడే దెయ్యాలు… రక్తం ఏరులై పారే పండగ… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ