BigTV English

Atm transactions: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏటీఎం చార్జీల్లో మోత

Atm transactions: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏటీఎం చార్జీల్లో మోత

బ్యాంకులకు ఏటీఎంల నిర్వహణ భారంగా మారిన తర్వాత కస్టమర్లకు చుక్కలు చూపెడుతున్నాయి. సర్వీస్ చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ లు తమ సొంత కస్టమర్లకు కూడా అపరిమిత ఏటీఎం సేవలను అందించడంలేదు. పరిమితి దాటితే కచ్చితంగా ప్రతి లావాదేవీకి రుసుము చెల్లించాల్సిందే. ఇక ఒక బ్యాంక్ ఖాతాదారుడు ఇంకో బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు తీసుకునే విధానానికి కూడా పరిమితి ఉంది. ఆ పరిమితి దాటితే భారీగా రుసుములు వసూలు చేస్తాయి బ్యాంక్ లు. వీటిని ఏటీఎం ఇంచర్ ఛేంజ్ ఫీజులు అంటారు. ఈ రుసుములను తాజాగా ఆర్బీఐ సవరించింది. కొత్త బాదుడు మే-1 నుంచి అమలులోకి వస్తుంది.


ఉదాహరణకు యూనియన్ బ్యాంక్ లో ఖాతా ఉంది. కానీ మీకు అందుబాటులో ఆ బ్యాంక్ ఏటీఎం లేదు. డబ్బు అత్యవసరం అయినప్పుడు మీరు ఏం చేస్తారు..? దగ్గర్లో ఉన్న మరో బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకుంటారు. ఇలా క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా పరిమితి ఉంది. నగరాల్లో అయితే నెలకు 5సార్లు, మిగతా ప్రాంతాల్లో నెలకు కేవలం 3 సార్లు మాత్రమే ఉచితంగా క్యాష్ విత్ డ్రా చేసుకునే వీలుంది. అంతకు మించి చేసే ట్రాన్సాక్షన్లన్నిటికీ బ్యాంక్ లు చార్జీలు వసూలు చేస్తాయి. అంటే తమ ఏటీఎంని వినియోగించుకున్నందుకు యూనియన్ బ్యాంక్ వద్ద ఏస్బీఐ చార్జీలు వసూలు చేస్తుందనమాట. అయితే యూనియన్ బ్యాంక్ ఆ చార్జీని తన కస్టమర్ కి బదిలీ చేస్తుంది. వాస్తవంగా ట్రాన్సాక్షన్ చార్జీలు బ్యాంక్ చెల్లించాలి. కానీ ఆ బ్యాంక్ కస్టమర్ చెల్లించే విధంగా నిబంధనలు అమలు చేస్తోంది.

క్యాష్ విత్ డ్రా చేసేందుకు ఇతర బ్యాంక్ ల ఏటీఎంలను పరిమితికి మించి వాడితే ఇప్పటి వరకు ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ.17 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడది రూ.19కి పెరిగింది. బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్ మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఇప్పటి వరకు రూ.6 వసూలు చేస్తుంటగా.. మే-1 తర్వాత దాన్ని రూ.7కి పెంచబోతున్నారు. ఈమేరకు ఇంటర్ ఛేంజ్ ఫీజులను పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.


నష్టపోయేది ఎవరు..?
వాస్తవానికి ఇంటర్ ఛేంజ్ ఫీజులు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వసూలు చేస్తాయి. ఈ ఫీజుల వల్ల అధికంగా ఏటీఎం సెంటర్లు నిర్వహించే బ్యాంక్ లకు ఎక్కువ లాభం చేకూరుతుంది. తక్కువ ఏటీఎంలు ఉండే చిన్న బ్యాంక్ లు, పెద్ద బ్యాంక్ లకు పెద్ద మొత్తంలో ఇంటర్ ఛేంజ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ లు ఆ ఫీజులను కస్టమర్లపై నెట్టేస్తున్నాయి. మన బ్యాంక్ ఏటీఎం అందుబాటులో లేకపోతే ఇతర బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తే ఆ భారం కస్టమర్లపైనే పడుతుంది. మే-1 నుంచి వారిపై మరింత భారం పడే అవకాశముంది.

బ్యాంక్ ల నిర్ణయంపై..
ఇంటర్ ఛేంజ్ చార్జీలను ఆర్బీఐ పెంచింది. అయితే వాటిని కస్టమర్లకు బదలాయించే విషయంలో మాత్రం ఆర్బీఐ మార్గదర్శకాలేవీ జారీ చేయలేదు. అంటే ఆయా బ్యాంక్ లు దీనికి తగినట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఏ బ్యాంక్ కూడా ఇంటర్ చేంజ్ చార్జీల రూపంలో నష్టపోవడానికి ఇష్టపడదు. అందుకే వాటిని తమ కస్టమర్లకు బదలాయిస్తుంది.

చిన్న బ్యాంక్ ల కస్టమర్లు లబోదిబో..
ఈ ఇంటర్ చేంజ్ చార్జీలు పెంచడం వల్ల చిన్న బ్యాంక్ ల కస్టమర్లు ఎక్కువగా నష్టపోతారు. ఆయా బ్యాంక్ లకు సంబంధించిన ఏటీఎంలు అందుబాటులో లేకపోతే కచ్చితంగా వారు ఇతర బ్యాంక్ ల ఏటీఎంలను ఆశ్రయించాల్సి వస్తుంది. అప్పుడు వారిపై మరింత భారం పడుతుంది.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×