BigTV English

Chhaava : శివాజీ కొడుకు కథకి అరుదైన గౌరవం… అక్కడ స్పెషల్ స్క్రీనింగ్..?

Chhaava : శివాజీ కొడుకు కథకి అరుదైన గౌరవం… అక్కడ స్పెషల్ స్క్రీనింగ్..?

Chhaava : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఛావా.. మారాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు.. భారీ అంచనాలతో ఫిబ్రవరి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా విడుదలైన మొదటి రోజు నుంచి కలెక్షన్స్ ని కూడా రాబడుతూ వస్తుంది. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీ కి మరో అరుదైన గౌరవం దక్కింది..


పార్లమెంట్ లో స్పెషల్ స్క్రినింగ్ లో ఛావా.. 

ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ మరో హిస్టరీని రిపీట్ చేసింది. ఈ సినిమా తాలూకా స్పెషల్ స్క్రీనింగ్‌ని భారతదేశ పార్లమెంట్‌లో వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చి 27 గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్‌కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్లు సమాచారం. అంతే కాదు  ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్‌లో సినిమాని చూడనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామని అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే మేకర్స్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు కానీ పార్లమెంట్లో సినిమా మాత్రం స్క్రీనింగ్ లో కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే.. ఏది ఏమైనా కూడా దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు..


కలెక్షన్స్ విషయానికొస్తే.. 

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ ఛావా.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రస్తుతం 1000 కోట్లకు చేరువలో ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లను అందుకుంది. మార్చి 20వ తేదీతో ఛావా విడుదలై 39 రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఐదో వారం ముగిసేసరికి విక్కీ కౌశల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు రాబట్టింది.. మొత్తానికి 800 కోట్ల వరకు రాబడినట్టు తెలుస్తుంది ఇదే స్పీడులో ఇంకొన్ని రోజులు గనక ఆడితే 1000కోట్లు రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఈ మూవీ ఓటిటి లోకి వచ్చే నెల 11వ తారీఖున రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×