AP Liquor Case: ఏపీలో లిక్కర్ కేసు వ్యవహారంలో వెంకటేష్ నాయుడు చుట్టూ తిరుగుతోంది. ఆయన టీడీపీకి చెందిన నేత అంటూ వైసీపీ నేతలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వైసీసీ నేత అంటూ కీలక విషయాలు బయటపెట్టింది టీడీపీ. తాజాగా విమానాల్లో నేతల జల్సాల గురించి బయటపెట్టారు ఆ పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి.
ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొత్త కొత్త విషయాలు బయటపెట్టింది టీడీపీ. ఈ కేసులో వైసీపీ నేతలకు ప్రమేయముందని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. వీఎస్ఆర్‌కి సంబంధం ఉందంటే వైసీపీ పాలనలో ప్రతీ ఒక్క నాయకుడికి ఈ కేసుతో సంబంధం ఉందని తేల్చేశారు. లిక్కర్ పేరుతో నేతలు చేసిన ఎంజాయిమెంట్, రాజభోగాలు అన్నీ ఇన్నీకావన్నారు.
విమానంలో ఓ హీరోయిన్ ఉందన్నారు. బయటకు వచ్చింది ఒక్క ఫోటో మాత్రమేనని, ఇంకా ఎన్ని ఫోటోలు ఉన్నాయని ప్రశ్నించారు. ఎన్ని విమానాల్లో ప్రయాణం చేశారు? ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ప్రైవేటు విమానాలు ఎన్ని వాడారు? అనేదానిపై సిట్ దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
విమానంలో ఉన్నది వెంకటేష్ నాయుడు కాదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. వెంకటేష్ నాయుడు ఇన్ కమ్ ట్యాక్స్ నాలుగు లక్షలు కట్టాడని గుర్తు చేశారు. ఒంగోలులో ఎంపీగా డమ్మీ నామినేషన్ వేసిన విషయం వైసీపీకి తెలీదా? కొత్త విషయాలు బయటపెట్టారు. వైసీపీలో మెయిన్ ఆఫీసు ఖాళీ చేసి లీగల్ సెల్ ఇచ్చారని, ఆ లెక్కన ఎన్ని తప్పులు చేశారో అర్థమవుతుందన్నారు.
ALSO READ: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు
అలాగే సాక్షి పేపర్ గురించి ఆయన ప్రస్తావించారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్, విజయసాయిరెడ్డి ఎవరు? లిక్కర్ బ్రేవరీస్‌లో బయట వ్యక్తులను తీసుకొచ్చి ఎందుకు పెట్టారన్నది ఆయన ప్రశ్న. పాత రోజా అక్క బయటకు వచ్చిందన్నారు. ఆమె గురించి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఎవరినైనా ఆ ప్రాంతానికి రానిచ్చారా? మిథున్‌రెడ్డి విషయంలో కార్యకర్తలంతా జైలు వద్ద ఉన్నారని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఏపీ మద్యం కొనుగోలు చేస్తున్నారని.. క్వాలిటీ, మనీ విషయంలో చాలా తక్కువగా ఉందన్నారు.
నాసిరకం మద్యం అని ఎన్నోసార్లు వైసీపీ చెప్పామని ఈ విషయాన్ని పలుమార్లు బయటపెట్టామన్నారు. డిటిజల్ పేమెంట్స్ పెట్టాలని పదే పదే చెప్పామని, క్యాష్‌కి ఆనాడు ప్రభుత్వం మొగ్గు చూపిందన్నారు. డిస్టలరీస్ అన్నీవైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ఇరుక్కుంటారని చెప్పినా ఏ మాత్రం మార్పు రాలేదన్నారు.
ఆరునెలల్లో పెట్టిన అదాన్ డిస్టలరీస్ రూ.250 కోట్లు ఆర్డర్లు ఎలా ఇచ్చారు? నాలుగేళ్లుగా హెచ్చరిస్తున్నామని, ఏ ఒక్కరూ వినలేదన్నారు. ఆనాడు వినలేదు.. ఈనాడు ఏడుస్తున్నారని మండిపడ్డారు. దొంగ కేసులు ఎవరు పెట్టారు? కేసులు బయటకు తీయలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు ఆనం వెంకటరమణారెడ్డి.
ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఎన్నిసార్లు చెప్పినా నా మాట నమ్మలేదు: ఆనం
లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతోందో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాను
దీనికి సూత్రధారి విజయసాయిరెడ్డి
సిట్ విచారణ మొదలైనప్పటి నుంచీ వినిపిస్తున్నది కథనాలు కాదు వాస్తవాలు
– ఆనం pic.twitter.com/LQWNCiOff6
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025