Free ChatGPT: ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) అకడమిక్ పరిశోధకుల కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన పరిశోధకులకు చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus) సేవలు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ ప్రాతిపదికన మొత్తం 50,000 కొత్త గ్రాంట్లను అందించనున్నట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికైన పరిశోధకుడితో పాటు మరో ఇద్దరు సహచరులకు చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus) సేవలు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలియజేసింది.
ఈ కార్యక్రమం భారత్‌లో కూడా అందుబాటులోకి రానున్నట్లు ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి దేశంలో నవంబర్ 30 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీని కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ స్థాయిలో సైన్స్, ఇంజనీరింగ్, గణిత రంగాల్లోని రీసెర్చ్ ఫ్యాకల్టీ, పోస్ట్ డాక్టోరల్ స్కాలర్లకు ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్ అందించాలని సంకల్పించారు. దీని ద్వారా సుమారు 2 లక్షల మంది పరిశోధకులకు లబ్ధి చేకూర్చాలని ఓపెన్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
We’re expanding free access to our frontier models for up to 200,000 scientists worldwide, with training and support.
Applications open Nov. 23. By default, we don’t use data shared through the program to train our models.
https://t.co/eJwqO9Q2WG
— OpenAI (@OpenAI) November 16, 2026
ఓపెన్‌ఏఐ సపోర్ట్ పేజీ వివరాల ప్రకారం.. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలో రీసెర్చ్ ఫ్యాకల్టీగా లేదా పోస్ట్-డాక్టోరల్ పరిశోధకులుగా పనిచేస్తూ ఉండాలి. అంతే కాకుండా గత మూడేళ్లలో తమ రంగంలో ఏదైనా పరిశోధన చేసి ఉండటంతో పాటు.. ఏఐ టూల్స్‌ను అకడమిక్ పరిశోధనల కోసమే వినియోగించాలన్న లక్ష్యంతో ఉండాలి. బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ అండ్ మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ రంగాలకు చెందిన వారు ఈ ఫ్రీ ప్లస్ యాక్సెస్‌కు అర్హులని ఓపెన్ ఏఐ మరోమారు స్పష్టం చేసింది.
Also Read: జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!
చాట్‌జీపీటీ ప్లస్ ద్వారా పరిశోధకులకు అడ్వాన్స్‌డ్ రీజనింగ్ (GPT-6), సూపర్ ఫాస్ట్ ఆన్సర్లు లభిస్తాయని ఓపెన్ ఏఐ తెలిపింది. వీటితో పాటు ఇమేజ్ జనరేషన్, వాయిస్ చాట్స్, మెమరీ అండ్ కాంటెక్స్ట్, కోడెక్స్ (Codex), ఫైల్ అప్‌లోడ్స్, ఎంపిక చేసిన ప్రాంతాల్లో డీప్ రీసెర్చ్ టూల్స్ వంటి మరెన్నో అదనపు ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. సాధారణంగా భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ ఛార్జీ నెలకు రూ. 1,999 కాగా.. ఏడాదికి రూ. 23,998 వరకు ఖర్చు కానుంది. అలాంటిది అర్హులైన పరిశోధకులకు ఈ సేవలు పూర్తి ఉచితంగా లభించనుండటం విశేషం.
Also Read: రాగి బాటిల్ vs స్టీల్ బాటిల్.. రోజూవారీ వాడకానికి ఏది బెస్ట్? దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్?