BigTV English

World First CNG Bike: వావ్.. ప్రపంచంలోనే తొలి CNG బైక్.. ఇక పెట్రోల్ అక్కర్లేదు.. లాంచ్ చేయనున్న బజాజ్

World First CNG Bike: వావ్.. ప్రపంచంలోనే తొలి CNG బైక్.. ఇక పెట్రోల్ అక్కర్లేదు.. లాంచ్ చేయనున్న బజాజ్
Advertisement

World First CNG Bike Launching by Bajaj on July 17th: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు బజాజ్ ఆటో అనేక అద్భుతమైన బైక్‌లను మార్కెట్లో అందిస్తోంది. ఈ క్రమంలోనే బజాజ్ ఆటో ప్రపంచంలోనే తన తొలి CNG బైక్‌ను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ బైక్‌ లాంచ్ మరింత ఆలస్యం కానుంది. ఈ సమాచారాన్ని బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు. అయితే మొట్టమొదటి CNG బైక్‌ను ఎప్పుడు విడుదల చేయవచ్చు? తదితర వివరాలు తెలుసుకుందాం.


బజాజ్ ఆటో భారత మార్కెట్లోకి తొలి CNG బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పుడు దీని లాంచ్ ఆలస్యం కానుంది. ఇది 18 జూన్ 2024న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు దీనిని 17 జూలై 2024న మార్కెట్లో లాంచ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. కంపెనీ తన మొదటి CNG బైక్‌ను మరింత అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

కొత్త బజాజ్ CNG డ్యూయల్-ఫ్యూయల్ సిస్టమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. రాబోయే ఈ బైక్ రెగ్యులర్ యూసేజ్‌కు చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని ఇంజన్ సామర్థ్యం దాదాపు 100-125 సీసీ ఉంటుంది. టెస్టింగ్ బైక్‌లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లతో కూడిన మోనోషాక్ వెనుక సస్పెన్షన్, బ్యాక్ డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్ ఉన్నాయి. సేఫ్టీ కోసం బైక్ సింగిల్-ఛానల్ ABS లేదా కాంబి-బ్రేకింగ్‌తో ఉంటుంది.


Also Read: మారుతీ ఆఫర్ల జాతర.. బాలెనోపై వేలల్లో డిస్కౌంట్లు!

బజాజ్ CNG బైక్ లాంచ్ చేయడానికి ముందు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. లాంచ్ చేయడానికి ముందు అన్ని రకాల పరిస్థితుల్లో దీనిని పరీక్షించారు. దీనిలో రౌండ్ షేపుడ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, చిన్న సైడ్ వ్యూ మిర్రర్, కవర్ సీఎన్‌జీ ట్యాంక్, పొడవాటి సింగిల్ సీట్, హ్యాండ్ గార్డ్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లను దేశంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌లో చూడవచ్చు. ఇందులో కంపెనీ ఒకటి కంటే ఎక్కువ వేరియంట్లను ఆఫర్ చేయవచ్చు. అయితే CNG బైక్‌లకు ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటి ఇంధనం నింపే స్టేషన్‌‌లు అందుబాటులో లేకపోవడం. దేశంలోని అన్నీ నగరాల్లో పరిమితమైన CNG బంక్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Warrant on Amazon: అమెజాన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. కర్నూలు కంజ్యుమర్ ఫోరం తీర్పు!

BSNL Samman Plan: ఒకసారి రీఛార్జ్ చేసుకుని ఏడాదంతా వాడుకోవచ్చు.. రోజూ 2 జీబీ డేటా కూడా, ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!

JioUtsav Offer: జియో ఉత్సవం బంపర్ ఆఫర్.. షాపింగ్ చేసి కూపన్ వాడితే భారీ తగ్గింపు

Gold Price: బంగారం ధర భారీగా పతనం, ఒకే రోజు రూ. 7 వేలు తగ్గుదల, అదే బాటలో వెండి కూడా!

Jio Free Data Offer: జియో బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 50జిబి ఉచిత స్టోరేజ్‌

Amazon Offers: లాస్ట్‌ ఛాన్స్ సేల్‌.. అమెజాన్‌ బజార్‌లో రూ.249 నుంచే షాకింగ్‌ ఆఫర్లు..

Amazon Settlement: 2.5 బిలియన్ డాలర్లతో అమెజాన్ సెటిల్మెంట్, యూజర్లు డబ్బులు ఎలా పొందాలంటే?

Google Wallet: ప్లైట్స్, ట్రైన్స్ లైవ్ అప్ డేట్స్.. గూగుల్ వ్యాలెట్ యూజర్లకు గుడ్ న్యూస్!

Big Stories

×