BigTV English

Discount on Maruti Baleno: మారుతీ ఆఫర్ల జాతర.. బాలెనోపై వేలల్లో డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్!

Discount on Maruti Baleno: మారుతీ ఆఫర్ల జాతర.. బాలెనోపై వేలల్లో డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్!

Huge Discount on Maruti Baleno Car: మారుతీ సుజుకీ తన అనేక కార్ల ధరలను తగ్గించింది. ఇందులో దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కూడా ఉంది. కంపెనీ తన అన్ని ఆటోమేటిక్ వేరియంట్‌లపై ధరలను రూ.5,000 వరకు తగ్గించింది. అయితే మ్యాన్యువల్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో బాలెనో CNG వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దీనితో పాటు కంపెనీ దానిపై 57,000 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. రూ.40,000 క్యాష్ బ్యాక్, రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.2,000 కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. మీరు ఈ నెలలో బాలెనోను కొనుగోలు చేయాలనుకుంటే దాని కొత్త ధరల గురించి మీరు తెలుసుకోవాలి.


మారుతీ సుజుకి బాలెనో ధరలు జూన్ 2024- 1.2-లీటర్ సాధారణ పెట్రోల్ వేరియంట్ పాత ధర కొత్త ధరలో సిగ్మా వేరియంట్ రూ. 6,66,000. బలేనో Delta వేరియంట్ రూ. 7,50,000 ఎటువంటి మార్పు లేదు. జేటా వేరియంట్ రూ. 8,43,000 ఆల్ఫా వేరియంట్ రూ. 9,38,000 ఒక్కోదానికి రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. జెటా AMTR రూ. 8,93,000 కాగా రూ. 8,88,000గా మారింది. ఆల్ఫా AMTR రూ.9,88,000 అయితే ఇప్పుడు రూ.983000. 1.2-లీటర్  CNG వేరియంట్ ఓల్డ్ ధర రూ. 8,40,000.

Also Read: మూడోసారి పీఎంగా మోడీ.. ఉపయోగించే కార్లు ఇవే.. ఫీచర్లు తెలిస్తే గూగుల్‌లో వెతికేస్తారు 


బాలెనోలో 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ కె12ఎన్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83bhp పవర్ రిలీజ్ చేస్తుంది. అదే సమయంలో మరో వేరియంట్ 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 90bhp పవర్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. బాలెనో CNG 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 78ps పవర్, 99nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బాలెనో పొడవు 3990mm, వెడల్పు 1745mm, ఎత్తు 1500mm,  వీల్‌బేస్ 2520mm. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 360 డిగ్రీల కెమెరా ఫీచర్‌తో వస్తుంది. ఇది 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తుంది. కారులో HUD ఫీచర్ కూడా మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మ్యూజిక్ కోసం ARKAMYS సరౌండ్ సిస్టమ్ ఉంది.

Also Read: మారుతీ ఆల్టోపై మాస్ డీల్.. ఆఫర్లతో తక్కువ ధరకే కొనేయండి!

బాలెనోలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, అలెక్సా వాయిస్ కమాండ్, హెడ్‌అప్ డిస్‌ప్లే, కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఇతర సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ABSతో EBD, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, రివర్సింగ్ కెమెరా, బ్యాక్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Top 6 Clothing Brands: ట్రెండీ- బడ్జెట్ ఫ్రెండ్లీ.. అదిరిపోయే డ్రెస్సులు కావాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Gold saving schemes: పొదుపుతో బంగారం సొంతం.. మీ కోసమే టాప్ స్కీమ్స్.. డోంట్ మిస్!

Big Stories

×