BigTV English
Advertisement

Vijay Thalapathy: అప్పుడు విద్యార్థినికి డైమండ్‌ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు.. ఇప్పుడు మళ్లీ..!

Vijay Thalapathy: అప్పుడు విద్యార్థినికి డైమండ్‌ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు.. ఇప్పుడు మళ్లీ..!

Vijay to Honor Class 10th and 12th Toppers in Tamil Nadu: ఎదుటి వ్యక్తికి సాయం చేయడం లేదా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించే విషయంలో ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. అయితే, తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది.


గతేడాది ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ ను విజయ్ కానుకగా ఇచ్చారు. అలాగే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్ తోపాటు రివార్డులను అందజేయనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా పదో తరగతి, ఇంటర్ లో టాప్ 3 లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించి, సన్మానం చేయనున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే?


ఇటీవలే విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంని ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ ‘ది గోట్’ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నది. స్వేహ, ప్రభుదేవా, లైలాతోపాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×