BigTV English
Advertisement

Bank Holidays Next Week: బ్యాంకులకు వరుస సెలవులు, నవంబర్ లో ఇన్ని హాలీడేస్ ఉన్నాయా?

Bank Holidays Next Week: బ్యాంకులకు వరుస సెలవులు, నవంబర్ లో ఇన్ని హాలీడేస్ ఉన్నాయా?

Bank Holidays In November 2024: దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు సాధారణంగా రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు సెలవులు తీసుకుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, జాతీయ, రాష్ట్రీయ బ్యాంకులు సైతం ఈ సెలవులను పాటిస్తాయి. త్వరలో ఛత్ పూజ వేడుక రానున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు వరుస సెలవులను పాటించనున్నాయి. ఫలితంగా నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు నాలుగు రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. బీహార్, జార్ఖండ్, ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్‌ లో ఈ సెలవులు కొనసాగుతాయి. కస్టమర్లు బ్యాంకు పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


నాలుగు రోజుల బ్యాంకు సెలవుల షెడ్యూల్

⦿నవంబర్ 7 (గురువారం) – ఛత్ పూజ సాయంత్రం: బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.


⦿నవంబర్ 8 (శుక్రవారం) – ఛత్ పూజ ఉదయం, వంగల పండుగ: బీహార్, జార్ఖండ్, మేఘాలయలో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.

⦿నవంబర్ 9 (శనివారం) – రెండవ శనివారం: RBI నిబంధనల ప్రకారం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు సెలవును పాటిస్తాయి.

⦿నవంబర్ 10 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.

నవంబర్ 2024లో అదనపు బ్యాంక్ సెలవులు

ఈ నెల ఛత్ పూజ సందర్భంగా రెండు రోజులు, శని, ఆది వారాలు కలుపుకుని వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. దానికి తోడు ఈ నెల మొత్తం బ్యాంకు సెలవులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿నవంబర్ 3 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.

⦿నవంబర్ 15 (శుక్రవారం): గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ వేడుకల కోసం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా సహా పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది.

⦿నవంబర్ 17 (ఆదివారం): దేశ వ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ అవుతాయి.

⦿నవంబర్ 18 (సోమవారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూతపడనున్నాయి.

⦿నవంబర్ 23 (శనివారం): మేఘాలయలో నాల్గవ శనివారం, సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.

⦿నవంబర్ 24 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.

Read Also: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

ఛత్ సెలవుల్లో బ్యాంకింగ్ అవసరాలు ఎలా తీర్చుకోవాలంటే?    

ఈ నెల వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో కస్టమర్లు ముందుగానే బ్యాంకు వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ATMలతో సహా డిజిటల్ బ్యాంకింగ్ ఎంపికలు సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉంటాయి. అవసరం అనుకున్న వాళ్లు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ నెల 10 రోజుల పాటు బ్యాంకులకు హాలీడేస్ రాబోతున్నాయి.  మరోవైపు వరుస సెలవులతో బ్యాంకు ఉద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సరదాగా టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కొంత మంది కొలీగ్స్ కలిసి టూర్లకు వెళ్లాలి అనుకుంటే, మరికొంత మంది ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు.

Read Also: యూపీఐ లావాదేవీల్లో అక్టోబ‌ర్‌లో సరికొత్త రికార్డు..ఎన్నికోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయంటే?

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×