BigTV English

MP Chamala Kiran Kumar Reddy : బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamala Kiran Kumar Reddy : బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamala Kiran Kumar Reddy :


⦿ ఎక్స్‌లో నిత్యం తప్పుడు ప్రచారాలే
⦿ ఎలన్ మస్క్ నుంచి బీఆర్ఎస్‌కు అవార్డ్ ఖాయం
⦿ గులాబీ పార్టీ పని అయిపోయింది
⦿ దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్
⦿ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసే బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు
⦿ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, స్వేచ్ఛ : నిత్యం ఏదో ఒక విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన రిప్లయ్ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సీఎం క్లుప్తంగా వివరించారని చెప్పారు. అయితే, రెండోసారి మోదీ రిప్లయ్ ఇచ్చి డిలీట్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. ఆయనకు కనీసం పార్టీ కార్యాలయంలో సొంత గది కూడా లేదని సెటైర్లు వేశారు. ఇక, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ పార్టీలో ఉద్యోగ నోటిఫికేషన్ వేశారని, బావ, బావమరిది మధ్య పోటీ జరుగుతోందని విమర్శించారు.


2004లో రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే మంత్రి అయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలతో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పోటీ పడుతోందని మండిపడ్డారు. ఎలన్ మస్క్ నుంచి అవార్డు వస్తుందని ఎద్దేవా చేశారు. 10 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో వివరాలతో సహా తెలియజేస్తామని, తమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు చామల. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల వారు తమ హయాంలో సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. మూసీ పునరుజ్జీవంతో అక్కడి రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు నిరంకుశ, దౌర్భాగ్య పాలనను తరిమికొట్టి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అయినా, లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు ఎలా గెలుస్తుందని సెటైర్లు వేశారు. అసలు, ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అంటూ మాట్లాడారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ALSO READ : టపాసులతో బైక్ స్టంట్స్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో.. వారిని ఏం చేశారో తెలుసా?

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×