E-Paper
Advertisement

September : అమ్మో.. సెప్టెంబరులో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? మీ లావాదేవీలుంటే పూర్తిచేసుకోండి..

September : అమ్మో.. సెప్టెంబరులో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? మీ లావాదేవీలుంటే పూర్తిచేసుకోండి..
Advertisement

Bank Holidays in September 2024 : మనదేశంలో బ్యాంకులకు ఏడాది కాలంలో సెలవులు పుష్కలంగా ఉంటాయి. జాతీయ సెలవులతో కలిపి.. స్థానిక పండుగలు, రెండో శనివారాలు, ఆదివారాలు ఇలా చాలానే ఉంటాయి. ఒక్కోసారి ఒకే నెలలో 2 పండుగలు వస్తుంటాయి. అలాంటి సమయంలో నెలలో సగంరోజులు బ్యాంకులు మూతపడి ఉంటాయి. బ్యాంకులకు సెలవులను నిర్ణయించే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఆర్బీఐ నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయి.

తాజాగా సెప్టెంబర్ 2024 లో బ్యాంకుల సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగలు, నిర్దిష్ట సెలవులు, ప్రతి రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు అన్నీ కలిపి.. సెప్టెంబర్ నెలలో మొత్తం 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఆయా తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే.. డిజిటల్ చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదన్న విషయం తెలిసిందే.

Advertisement

సెప్టెంబరులో రాష్ట్రాలవారిగా బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

సెప్టెంబర్ 1- ఆదివారం

Advertisement

సెప్టెంబర్ 5, గురువారం – అస్సాం, ఛత్తీస్ గఢ్, సిక్కిం రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 7 – వినాయక చవితి , దేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు

సెప్టెంబర్ 8 – ఆదివారం

సెప్టెంబర్ 14 – రెండవ శనివారం, ఓనం

సెప్టెంబర్ 15 – తిరుఓనం, ఆదివారం

సెప్టెంబర్ 16 – ఈద్ మిలాద్ , దేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు

సెప్టెంబర్ 17 – ఇంద్ర జత్ర , సిక్కింలో బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 18 – శ్రీనారాయణ గురు సమాధి, కేరళలో బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 22 – ఆదివారం

సెప్టెంబర్ 23 – హర్యానా హీరోస్ మార్టీడోమ్ డే

సెప్టెంబర్ 28 – నాలుగవ శనివారం

సెప్టెంబర్ 29 – ఆదివారం

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×