E-Paper
Advertisement

రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?

రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?
Advertisement

Gold Price Down: ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు అమాంతంగా పడిపోతున్నాయా? ఆ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందా? పతనానికి బ్రేక్ పడేది ఎప్పుడు? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో గరిష్టాలకు ఎగబాకిన ఈ లోహం ధర.. ఆ తర్వాత పతనం మొదలైంది. నెక్ట్స్ ఏంటన్నది అసలు ప్రశ్న.

బంగారం పతనం,  చరిత్ర ఏం చెబుతోంది?

రెండేళ్లు కిందట అంటే 2024 ఏడాదిని బంగారం సంవత్సరంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఏడాది నుంచి పసిడి ధర పెరగడం మొదలైంది. అప్పుడు బంగారం ధర 10 గ్రాములకు రూ. 62,000 ఉండేది. 2026 జనవరి నాటికి 10 గ్రాములు రూ. 1,75,000 కు చేరడంతో సామాన్యుడు షాకయ్యాడు. బంగారం షాపుల వైపు కొనుగోలుదారులు చూడడం మానేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఇరాన్ యుద్దం మొదలు కావడంతో బంగారం ధరలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

ఐదు దశాబ్దాల్లో మూడేళ్లు మాత్రమే

Advertisement

మార్చి నుంచి బంగారం ధరలు ఇప్పటివరకు 32 శాతం తగ్గిందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ. 1.2 లక్షలకు చేరువలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలపడిన అమెరికన్ డాలర్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, బులియన్ మార్కెట్లలో పెరిగిన అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో ధరలు భారీగా పతనమయ్యాయి. చారిత్ర గణాంకాల ప్రకారం.. తాత్కాలికంగా 10 నుంచి 15 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ 1980 నుండి 78 శాతం బంగారం సానుకూల వార్షిక రాబడులను అందించిందని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

ఇప్పుడు కోలుకుని 2026 చివరి నాటికి సానుకూలంగా ముగిస్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. గడిచిన ఐదు దశాబ్దాలుగా మధ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ బంగారం పని తీరు ఎలా ఉంది? 1981లో బంగారం ఉహించని విధంగా పడిపోయిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఏడాదిలో కొనుగోలుదారులు హ్యాపీగా ఫీలయ్యారు. మైనస్ 22 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో అదే సీన్ రిపీట్ అయ్యింది.

Advertisement

ALSO READ: బంగారం, వెండి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? మన దేశంలో రేట్లు ఎలా ఫిక్స్ అవుతాయో తెలుసా?

తాజాగా 2026 ఏడాది వంతైంది. ప్రస్తుతం మైనస్ ఐదు శాతం తగ్గుదల నమోదు అయ్యిందని అంటున్నాయి. పైన చెప్పిన మూడేళ్ల తప్పితే.. మిగతా సంవత్సరాల్లో బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఏడాది ముగింపుకు 2 నుంచి 76 శాతం వరకు లాభాలను నమోదు చేసినట్టు చెబుతున్నాయి. ఈ ఏడాది ముగియడానికి కేవలం ఒక్క నెల మాత్రమే ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు పతనం ఖాయమని అంటున్నారు.

Related News

భారీగా బంగారం-వెండి ఈటీఎఫ్‌లు పతనం.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాల సెగ!

బంగారం, వెండి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? మన దేశంలో రేట్లు ఎలా ఫిక్స్ అవుతాయో తెలుసా?

భారత్ దగ్గర వేల కోట్ల విలువైన బంగారం.. ఎక్కడ దాచిపెడతారో తెలుసా?

బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజు రూ. 5 వేలకు పతనం! ధరలు ఎలా ఉన్నాయి.

EPFOలో కీలక మార్పులు.. ఇకపై ప్రతి నెలా జీతం PF నుంచే, ఖాతాలో కనీస నిల్వలు తగ్గింపు

రూ.5 లక్షలు సేవింగ్స్ ఉంటే పెట్టుబడి కోసం ఇలా ప్లాన్ చేయండి.. చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సూచనలు

ఒక్క చోటే అంత బంగారమా? ఏకంగా ఏడు లక్షల కోట్లు.. లక్ అంటే వాళ్లదే!

Big Stories

Advertisement
×