Influencer Success Story: రోజువారీ జీవితంలో జరిగే చిన్నచిన్న విషయాలను పంచుకోవడానికి మెుదలుపెట్టిన సోషల్ మీడియా ప్రయాణం.. ఓ మహిళ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఏడాదిన్నర పైగా నర్స్ ఉద్యోగం చేస్తూ కంటెంట్ క్రియేటర్‌గానూ రాణించిన అమెరికాకు చెందిన ఓ యువతి.. ఇప్పుడు పూర్తిస్థాయి ఇన్ ఫ్లూయెన్సర్ గా మారిపోయింది. 7 నెలల వ్యవధిలో వివిధ బ్రాండ్స్ కు సంబంధించిన ప్రమోషనల్ డీల్స్ ద్వారా ఏకంగా రూ.82 లక్షలు ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. ఈ విషయాన్ని సారా స్వయంగా వెల్లడించడంతో.. ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది.
తన వీడియోలో సారా ఆన్ (Sarah Ann) మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేషన్‌పై మరింత దృష్టి పెట్టడంతో పాటు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే నర్స్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు తెలిపారు. నర్సుగా చేస్తున్న 9 to 5 ఉద్యోగాన్ని తాను వదిలేశానని.. ఈ నిర్ణయం తీసుకునేలా దైర్యం ఇచ్చిన ఆర్థిక లెక్కలను సైతం ఆమె బయటపెట్టారు. ఏడాదిన్నర క్రితం కంటెంట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఇది ఎక్కడివరకు వెళ్తుందో అని ఆలోచించేదానిని సారా అన్నారు. కానీ ఈ స్థాయికి రావడం తన అదృష్టమన్నారు. ప్రతి ఒక్కరి కథలోనూ పంచుకోదగ్గ విషయం ఉంటుందని.. తన విషయంలో మాత్రం అది ఇదేనని సారా సంతోషం వ్యక్తం చేశారు.
7 నెలల వ్యవధిలో రూ.1.75 కోట్ల బ్రాండ్ డీల్స్ వచ్చినట్లు సారా తెలిపారు. ఈ ఏడాది మే నెలలో తన మొదటి బ్రాండ్ డీల్‌పై సంతకం చేశానని.. కొన్ని నెలల్లోనే ఎక్కువ డీల్స్ రావడం మెుదలయ్యాయని ఆమె తెలిపారు. మే నుంచి నవంబర్ మధ్య కాలంలో ఆమె మొత్తం 1,87,785 డాలర్ల (సుమారు రూ. 1.75 కోట్లు) విలువైన బ్రాండ్ డీల్స్‌పై సంతకం చేశారు. అయితే ఈ మొత్తం పూర్తిగా ఆమె చేతికి రాకపోవడం గమనార్హం. ఇందులో ఏజెన్సీ కమీషన్‌తో పాటు పన్నుల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని సారా తెలిపారు. ఫలితంగా రూ.87 లక్షలు ఖాతాలో చేరాయన్నారు. తన తరఫున బ్రాండ్లను సంప్రదించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పనులను ఏజెన్సీ చూసుకుంటుందని, అందుకు ప్రతిఫలంగా ఒక్కో డీల్‌లో కొంత శాతాన్ని కమీషన్‌గా తీసుకుంటుందని సారా వివరించారు.
Also Read: భారతీయులకు ఫ్రీ ఎంట్రీ రద్దు.. వీసా రూల్స్ మార్చేసిన మలేసియా.. కారణం ఏంటంటే?
అంతేకాకుండా నర్సుగా తన పాత ఆదాయంతో ఇన్ ఫ్యూయెన్సర్ గా తన సంపాదనను సారా పోల్చి చూశారు. ఏడు నెలల కంటెంట్ క్రియేషన్‌లో తాను సంపాదించిన మొత్తం.. నర్సుగా తన ఏడాది జీతం కంటే ఎంతో ఎక్కువని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో సోషల్ మీడియా కంటెంట్ పై ఫోకస్ పెట్టి అందులో మరింత రాణించాలన్న నిర్ణయానికి తాను వచ్చినట్లు స్పష్టం చేశారు. కాగా సారా తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పూర్తిస్థాయి క్రియేటర్‌గా మారేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని పలువురు ప్రశంసించారు. నర్సుగా ఉంటూ ఆమె పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ సారా ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
?utm_source=ig_embed&ig_rid=ACv-A3ZtwbsrESrY8UfZQEX
Also Read: 90s కిడ్స్ ఫేవరెట్.. మార్కెట్లోకి నోకియా 1100 రీ-ఎంట్రీ.. ఇక బ్యాక్ టూ గోల్డెన్ డేస్ మామ!