E-Paper
Advertisement

ఓ వైపు బంగారం.. మరోవైపు క్రిప్టో కరెన్సీ, రెండేళ్ల కనిష్టానికి పతనం, ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతోంది?

ఓ వైపు బంగారం.. మరోవైపు  క్రిప్టో కరెన్సీ, రెండేళ్ల కనిష్టానికి పతనం, ప్రపంచ మార్కెట్లో ఏం జరుగుతోంది?
Advertisement

Bitcoin Market: ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు హెచ్చుతగ్గులు మొదలయ్యాయి. శుక్రవారం బులియన్ మార్కెట్.. శనివారం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వంతైంది. అమెరికా మార్కెట్లో బిట్‌కాయిన్ ధర రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో పెట్టుబడుదారులు లబోదిగో మంటున్నారు. ఈ కరెక్షన్ ఎంత కాలం జరుగుతుందో చెప్పలేమని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

ఓ వైపు బంగారం.. మరోవైపు క్రిప్టో కరెన్సీ

ప్రపంచంలోకి కీలకమైన మార్కెట్లు పతనం దిశగా నడుస్తున్నాయి. శుక్రవారం పడిసి మార్కెట్ అమాంతంగా కుప్పకూలింది. శనివారం ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ మార్కెట్ పతనమైంది. యూఎస్ మార్కెట్‌లో బిట్‌కాయిన్ దాదాపు 6 శాతం పడిపోయింది. ప్రస్తుతం 55,533 డాలర్లకు చేరింది. 2024 సెప్టెంబర్ తర్వాత బిట్ కాయిన్ విలువ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరు నాటికి క్రిప్టో కరెన్సీ 126,000 డాలర్లు దాటింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ధర సగానికి పైగా పడిపోయింది.

Advertisement

ఈ పతనం క్రిప్టో పెట్టుబడి దారుల్లో ఆందోళనను అమాంతంగా పెంచింది. క్రిప్టో మార్కెట్‌లో నెలకొన్న గందరగోళానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీలు పెడుతున్న భారీ పెట్టుబడుల నుండి ఆశించిన రాబడులను చూడటానికి ఎంత కాలం వేచి ఉండాల్సి వస్తుందోనని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు అమెరికాలో పెరుగుతున్న రుణ వ్యయాలు, నియంత్రణపరమైన రిస్కులు పెట్టుబడి దారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

రెండేళ్ల కనిష్టానికి క్రిప్టో కరెన్సీ పతనం

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించిన తర్వాత క్రిప్టో మార్కెట్‌లో అనిశ్చితి మొదలైంది. క్రిప్టో కరెన్సీకు అనుకూలమైన నియంత్రణ నిబంధనలను రూపొందించే ప్రయత్నాలు మందగించవచ్చని పెట్టుబడిదారుల ప్రధాన భయం. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ బైనాన్స్‌లో జరిగిన హ్యాకింగ్ ఘటన బిట్‌కాయిన్‌పై విశ్వాసాన్ని అమాంతంగా దెబ్బతీసింది. ఇటీవల ఎన్విడియా నుంచి సీఈఓ జెన్సన్ హువాంగ్ వైదొలగడం కూడా క్రిప్టో మార్కెట్‌పై ప్రభావం చూపిందని అంటున్నాయి. పైన చెప్పిన వ్యవహారాలు క్రిప్టో మార్కెట్‌లో తీవ్ర కలకలం రేపాయి.

Advertisement

ALSO READ: మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా

ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్-ETFల నుండి పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉప సంహరించుకోవడమే బిట్‌కాయిన్ పతనానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు బిట్‌కాయిన్ ETFల నుండి 3 బిలియన్ డాలర్లకు పైగా ఉప సంహరించుకున్నారన్నది నివేదికల సారాంశం. బలపడుతున్న యూఎస్ డాలర్, ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు క్రిప్టో మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. మొత్తానికి వచ్చేనెల కూడా ఈ పతనం కంటిన్యూ కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Related News

మిస్డ్ కాల్స్‌తో రూ.8,300 కోట్ల కంపెనీ.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ బిజినెస్ ఐడియా

క్లెయిమ్‌ల తిరస్కరణ, అక్రమ కోతలపై .. స్టార్ హెల్త్‌కు రూ. 2 కోట్ల జరిమానా!

పెట్టుబడిదారుడు చనిపోతే అతని మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డి ఎవరికి వర్తిస్తాయి?.. నామినీ, నిబంధనలు ఇవే

నర్సు ఉద్యోగానికి గుడ్ బై.. 7 నెలల్లోనే రూ.1.75 కోట్ల సంపాదన.. కంటెంట్ క్రియేషన్ పవర్ అంటే ఇదీ!

రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?

భారీగా బంగారం-వెండి ఈటీఎఫ్‌లు పతనం.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాల సెగ!

బంగారం, వెండి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? మన దేశంలో రేట్లు ఎలా ఫిక్స్ అవుతాయో తెలుసా?

భారత్ దగ్గర వేల కోట్ల విలువైన బంగారం.. ఎక్కడ దాచిపెడతారో తెలుసా?

Big Stories

Advertisement
×