BigTV English

Best and Top 10 Selling Bikes: మన దేశంలో సెల్లింగ్‌లో ఈ బైకులే కింగ్.. డోంట్ మిస్ ఇట్!

Best and Top 10 Selling Bikes: మన దేశంలో సెల్లింగ్‌లో ఈ బైకులే కింగ్.. డోంట్ మిస్ ఇట్!
Best Selling Top 10 Bikes
Best Selling Top 10 Bikes

Top and Best Selling Bikes in India: టూ వీలర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా వర్షం పడుతున్నప్పుడు గర్ల్‌ఫ్రెండ్‌‌ను బ్యాక్ సీట్‌లో కూర్చోబెట్టుకొని బైక్‌పై రయ్యమని దూసుకుపోతుంటే ఆ కిక్కే వేరు. ఇక యువత బైక్‌లకు రకరకాల మాడిఫికేషన్లు చేయించి బైక్‌లపై ఈల వేస్తూ రచ్చరంబోలా చేస్తుంటారు. ముఖ్యంగా యువత బైక్‌లు కొనుగోలు చేయడంలో డబ్బును కూడా లెక్కచేయడం లేదు. ఎందుకంటే బైక్ అంటే యువతకి అంతపిచ్చి.


అయితే ఇంత క్రేజ్‌తో లక్షలు పోసి కొన్న బైకులు కొన్ని నెలలకే మోరాయిస్తుంటాయి. త్వరగా రిపేర్‌కు వస్తాయి. అప్పుడు మెకానిక్ వేసే బిల్లు చూస్తే గుండెలు ఢమాల్ అంటాయి. మీరు కూడా వీటిని ఫేస్ చేసినట్లయితే మనదేశీయ మార్కెట్‌లోనే సూపర్ బైకులు ఉన్నాయి. ఈ బైకులు టాప్ సేల్స్‌ను నమోదు చేశాయి. ఆ లిస్టులో 10 బైకులు ఉన్నాయి. ఈ బైకులు మీకు మంచి డ్రైవింగ్ ఫీల్‌ను అందిస్తాయి. ఈ 10 బైకులు ఏకంగా 7,95,663 యూనిట్ల సేల్స్‌ నమోదు చేసి36.42 శాతం సేల్స్‌లో వృద్ధి సాధించాయి. అవేంటో చూడండి.

Hero Splendor


హీరో స్ప్లెండర్ ఫిబ్రవరి 2024లో టూ వీలర్ సేల్స్‌ను బ్లాస్ట్ చేసింది. కంపెనీ 2,77,939 యూనిట్లును విక్రయించింది. మార్కెట్‌లో బెస్ట్‌సెల్లింగ్ మోటర్ సైకిల్‌గా టాప్ 1లో నిలిచింది. గతేడాదితో పోలిస్తే సేల్స్ గణనీయంగా పెరిగాయి.

Also Read: హ్యుందాయ్ హోలీ సేల్.. కార్లపై క్రేజీ డిస్కౌంట్!

Honda Shine

హోండా షైన్ టూ వీలర్ మార్కెట్‌లో రెండో స్థానంలో నలిచింది. కంపెనీ 1,42,763 యూనిట్లను సేల్ చేసింది. 2023 ఫిబ్రవరితో పోలిస్తే ఏకంగా.. 301.09 శాతం అమ్మకాలు పెరిగాయి. హోండా తన కొత్త ఎంట్రీ లెవల్ షైన్ 100ని విడుదల చేయడంతో ఈ రికార్డ్ సొంతమైంది.

Bajaj Pulsar

బజాజ్ పల్సర్ యూత్‌ ఫేవరెట్‌ బైక్. టూ వీలర్ మార్కెట్‌లో టాప్ 3లో నిలిచింది. కంపెనీ 1,12,544 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది బజాజ్‌ పల్సర్‌ NS బైక్‌లు లేటెస్ట్ అప్‌డేటే దీనికి కారణం. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే బజాజ్‌ పల్సర్‌ 40.49 శాతం వృద్ధిని నమోదు చేసింది.

HF Deluxe

HF డీలక్స్.. హీరో మోటోకార్ప్‌కు చెందిన బైక్. కంపెనీ 76,138 యూనిట్లను విక్రయించి 4వ స్థానంలో నిలిచింది. సేల్స్‌లో 35.26 శాతం వృద్ధి సాధించింది. బెస్ట్ మైలేజ్, సరసమైన ధర కారణంగా కస్టమర్లకు తీరులేని ఆప్షన్‌గా డీలక్స్ మారింది.

Also Read: స్టాక్ మార్కెట్ కింగ్ జీవిత సత్యాలు..

TVS Raider

టీవీఎస్ రైడర్ సేల్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2024లో 2,063 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 38.61 శాతం వృద్ధిని సాధించింది. ఆకట్టుకునే డిజైన్‌, అధునాతన ఫీచర్లతో టూ వీలర్ లవర్స్‌ను టీవీఎస్ అట్రాక్ చేసింది. ఇక హీరో ప్యాషన్ 6వ స్ధానం,బజాజ్‌ ప్లాటినా టాప్ 8లో, ప్రముఖ టూ వీలర్‌ బ్రాండ్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, 350లు 9,10 స్థానాల్లో నిలిచాయి.

Tags

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×