BigTV English
Advertisement

Stylish Bikes: స్టైలిష్ ‌లుక్స్‌‌తో అదరిపోయే బైకులు.. కేకపెట్టిస్తున్న డిజైన్, మైలేజ్!

Stylish Bikes: స్టైలిష్ ‌లుక్స్‌‌తో అదరిపోయే బైకులు.. కేకపెట్టిస్తున్న డిజైన్, మైలేజ్!

Stylish Bikes: దేశంలో బైకుల వినియోగం గణనీయంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా ఇవి ప్రధాన రవాణా మార్గంగా మారాయి. ఆఫర్డ్‌బుల్ ప్రైస్‌లో సమర్థవంతమైన బైక్‌లరకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత రూ.2 లక్షల్లో బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి పర్ఫామెన్స్, స్టైలిష్ లుక్‌ అందించే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్డపడుతున్నారు. ఈ మార్కెట్‌లో కంపెనీలు రకరకాల బైక్‌లను తీసుకొచ్చాయి. వీటి మధ్య పోటీ కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో మంచి పర్ఫామెన్స్, లుక్ ఇచ్చే ఐదు బైక్‌ల గురించి తెలుసుకుందాం.


1) Royal Enfield Hunter 350
హైవే రైడింగ్‌లో ఈ బైక్ మంచి పర్ఫామెన్స్ అందిస్తోంది. ఇందులో 3 వేరియంట్లు,10 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. హంటర్ 350 బైక్ 349.34cc, BS6 ఇంజన్‌తో వస్తుంది. ఇది 20.2 bhp పవర్ 27 Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. బ్రేకింగ్ కోసం బైక్ ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది. దీని ధర రూ.1.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: బైక్ లవర్స్‌కు పండగే.. డూకాటి నుంచి స్పోర్టీ బైక్.. కెటిఎమ్ కోసమేనా?


2) Bajaj NS200
ఇది స్టైలిష్ నేక్డ్ డిజైన్‌తో వస్తుంది. పల్సర్ NS200లో 199.5cc BS-6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 24.13 bhp పవర్, 18.74 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ముందు, వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లను చూడొచ్చు. దీనితో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. బైక్ బరువు 159.5 కిలోలు. దీని ధర రూ.1.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

3) TVS Ronin
ఈ బైక్ చాలా స్టైలిష్‌తో వస్తుంది. ఇది లెటెస్ట్ క్రూయిజర్ లుక్‌తో వస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 4 వేరియంట్లు మరియు 7 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇందులో 225.9సీసీ, బీఎస్-6 ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 20.1 bhp మరియు 19.93 Nm ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో అమర్చబడి ఉంటుంది. ఇది ముందు మరియు వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ధర రూ. 1.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

4) TVS Apache RTR200 4v
దీని ధర రూ.1.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2 వేరియంట్లు, 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 200cc, సింగిల్ సిలిండర్ BS-6 ఇంజిన్‌తో కూడిన ఈ బైక్ చాలా స్పోర్టీగా ఉంటుంది. దీని ఇంజన్ 20.54 బిహెచ్‌పి పవర్, 17.25 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో కూడిన ABS కూడా ఉంది.

Also Read: డార్లింగ్ ప్రభాస్ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో.. ఒక్కోదాని కాస్ట్ తెలిస్తే మతిపోతుంది!

5) Yamaha R 15S
యమహా ఆర్ 15 ఎస్ ప్రారంభ ధర రూ. 1.65 లక్షలు. భారతదేశంలో ఇది సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. యమహా R15S 155 ccbs6-2.0 ఇంజన్‌ను కలిగి ఉంది ఇది 18.6 PS పవర్, 14.1 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. దీనికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

Tags

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×