BigTV English

France plane crashes on highway: పారిస్‌లో రోడ్డుపై కూలిన విమానం, ముగ్గురు మృతి

France plane crashes on highway: పారిస్‌లో రోడ్డుపై కూలిన విమానం, ముగ్గురు మృతి

France plane crashes on highway(International news in telugu): ఫ్రాన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విమానం ఆ దేశ నేషనల్ హైవేపై కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్పాట్‌లో చనిపోయారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు.


విమానం కూలిన ఘటనలో అసలేం జరిగింది? ఉత్తర పారిస్ రీజియన్‌లో డిస్నీల్యాండ్ సమీపంలోని చిన్న ప్యాసింజర్ విమానం తక్కువ ఎత్తులో వెళ్తోంది. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్‌లో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ సర్వీసు అక్కడికి చేరుకుంది. వెంటనే రెస్క్యూ సిబ్బంది గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారు. హైవేపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాపిక్ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.


ALSO READ: టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 60 మందికిపైగా..

విమానం టేకాఫ్ అయిన అరగంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా హై ఓల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. ఈ ఘటనపై విమాన సేఫ్టీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది టూరిస్టు విమానంగా చెబుతున్నారు. పైలట్‌కి స్వల్పగాయలయ్యాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×