BigTV English

Bitcoin India value: 2009లో మీరు ఇందులో రూ.2 పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు కోటీశ్వరులు అయ్యేవారు!

Bitcoin India value: 2009లో మీరు ఇందులో రూ.2 పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు కోటీశ్వరులు అయ్యేవారు!

Bitcoin India value: ఒక్కోసారి జీవితంలో కొన్ని నిర్ణయాలు కోటీశ్వరులను చేస్తాయి. అదే 2009లో మీ దగ్గర ఉన్న రూ.2ను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే, ఈరోజు మీ బ్యాంక్ ఖాతాలో కోటి రూపాయలకు పైగా నిక్షేపాలు ఉండేవి! ఇది ఎలాంటి వ్యాపారం కాదు, ఓ డిజిటల్ టోకెన్ ప్రయాణం. పేరు బిట్‌కాయిన్. అప్పట్లో ఒక్క బిట్‌కాయిన్ ధర కేవలం రూ.2.25 మాత్రమే. కానీ ఇప్పుడు? ఏకంగా రూ.1,00,36,400!


ఇటీవల శుక్రవారం రోజున బిట్‌కాయిన్ చరిత్రను తిరగరాశింది. దాని విలువ అంతర్జాతీయంగా $116,906.22కి ఎగబాకింది. ఇది గత 24 గంటల్లోనే దాదాపు 6 శాతం పెరుగుదల. భారతీయ రూపాయల్లో చెప్పాలంటే.. ఒక బిట్‌కాయిన్ ధర కోటి రూపాయలకుపైగా. అంతే కాదు, గత 15 ఏళ్లలో దీని పెరుగుదల దాదాపు 44.80 లక్షల రెట్లు, అంటే 4,460,00,000 శాతం!

ఈ లెక్కలు విని ఆశ్చర్యపోవడం సహజం. కానీ దీని వెనుక ఉన్న సాంకేతిక, ఆర్థిక కారణాలు ఏమిటంటే.. బిట్‌కాయిన్ ఇప్పుడు కేవలం నేరుగా వినియోగదారుల ఆసక్తి వల్ల మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో పెద్ద సంస్థల మద్దతు వల్ల కూడా దూసుకెళ్తోంది. ట్రంప్ ప్రభుత్వంలో క్రిప్టో పట్ల ఉన్న అనుకూల విధానాలు, బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లపై పెరిగిన పెట్టుబడులు, కోయిన్బేస్ సంస్థ ఎస్పీ గ్లోబల్ ఇండెక్స్‌లో చేర్చబడడం వంటి అంశాలన్నీ దీని విజయాన్ని పుంజించాయి.


బయు కాయిన్ సీఈఓ శివం ఠాక్రాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బిట్‌కాయిన్ $116,000 మార్క్‌ను దాటి వెళ్లడం అనేది ఇది ఇప్పుడే మొదలు అనిపించేలా ఉంది. వ్యాపార రంగంలో దీని ఆమోదం పెరగడం, బలమైన ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు, ప్రపంచ వ్యాప్తంగా రెగ్యులేటరీ మద్దతు దీని వెనుక ఉన్న మేజర్ డ్రైవర్స్.

ఇక పి42 సంస్థ సహ వ్యవస్థాపకుడు అవినాష్ శేఖర్ అభిప్రాయం ప్రకారం, గత 24 గంటల్లో జరిగిన $453 మిలియన్ షార్ట్ స్క్వీజే ఈ ర్యాలీకి చక్రం ఎక్కించింది. బేర్ ట్రేడర్లు ఊహించిన దాని కంటే మార్కెట్ ఊపందుకోవడంతో వారి పొజిషన్లు లిక్విడేట్ కావడంతో బలవంతపు కొనుగోళ్ల ద్వారా ఈ ఎగబాకుడు మరింత వేగాన్ని అందుకుంది.

ఇదే సమయంలో డాజ్‌కాయిన్ కూడా ఈ క్రిప్టో జోరుకు సహకరిస్తోంది. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భయాల మధ్య ఇన్వెస్టర్లు డిజిటల్ అసెట్‌లను భవిష్యత్ వృద్ధికి అనువైనదిగా భావిస్తున్నారు.

బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం నాటికి $2.232 ట్రిలియన్‌కు చేరింది. అదే సమయంలో దాని ట్రేడింగ్ వాల్యూమ్ 24 గంటల్లోనే 70 శాతం పెరిగింది. దాదాపు $100 బిలియన్ విలువైన బిట్‌కాయిన్లు ట్రేడయ్యాయి. మొత్తం క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్ ఒక్కదాని డొమినెన్స్ దాదాపు 63.8 శాతంగా ఉంది.

Also Read: Chicken rice for Dogs: వీధి కుక్కలకు ‘రైస్ విత్ చికెన్’.. కొత్త స్కీమ్ అమలు.. ఖర్చు కోట్లల్లోనే!

అంతేకాకుండా, బ్లాక్‌రాక్ సంస్థ ఒక్కదానికే $65 బిలియన్ విలువైన బిట్‌కాయిన్ నిల్వ ఉండటం, అమెరికాలోని బిట్‌కాయిన్ ఈటీఎఫ్లలో ఇప్పటికే $50 బిలియన్ పైగా నెట్ ఇన్‌ఫ్లోలు రావడం, కార్పొరేట్ కంపెనీలు తమ ట్రెజరీల్లో బిట్‌కాయిన్ నిల్వ చేయడం వంటి అంశాలు దీన్ని ఒక మెయిన్‌స్ట్రీమ్ అసెట్‌గా మారుస్తున్నాయి.

మరోవైపు, ట్రంప్ పాలన క్రిప్టో రంగానికి మద్దతు ఇవ్వడం, స్ట్రాటజిక్ బిట్‌కాయిన్ రిజర్వ్ పైన చర్చలు జరగడం, ఈటీఎఫ్‌లకు అనుమతుల సరళత తదితర విషయాలు దీని వృద్ధికి కొత్త దిశనిచ్చాయి. ఇక మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాప్ రూ.3.65 ట్రిలియన్ దాటి వెళ్లింది. గత 24 గంటల్లో ట్రేడింగ్ వాల్యూమ్ $206.5 బిలియన్ మార్క్‌ను అధిగమించింది. ఈథీరియం, ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, డాజ్‌కాయిన్, కార్డానో వంటి ఇతర టోకెన్లు 6-11 శాతం మధ్య లాభపడ్డాయి.

జూన్ 2025లో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ మొత్తం 2.62 శాతం వృద్ధి చెందిందని బైనాన్స్ రీసెర్చ్ తెలిపింది. ఇది భౌగోళిక ఉద్రిక్తతల మధ్యన కూడా వచ్చిన వృద్ధి. దీని వెనుక పెద్ద సంస్థల నుంచి వచ్చిన పెట్టుబడులు, బిట్‌కాయిన్ డొమినెన్స్ పెరగడం, స్టేబుల్‌కాయిన్‌-డెసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లకు పాలసీ మద్దతు వంటి అంశాలు ఉన్నాయి.

మొత్తం చెప్పాలంటే.. ఓ చిన్న పెట్టుబడి మీ భవిష్యత్తును తిరగరాయవచ్చు. నేటి రోజుల్లో డిజిటల్ అసెట్‌లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ప్లాన్ చేస్తే, రేపటి కోటీశ్వరుడు మీరే కావచ్చు!

Related News

Airtel vs BSNL: 28 డేస్ వ్యాలిడిటీ.. ఈ ప్లాన్ వెనుక టెలికాం కంపెనీలు లాజిక్ ఏంటి?

Cars price drop: కార్ల ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా రేట్లు ఢమాల్.. కొత్త రేట్లు ఇవే!

Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 భారీ ఆఫర్స్‌తో భారత్‌లో లాంచ్. ధర ఎంతో తెలుసా?

BSNL New Plan: జస్ట్ రూ. 319కే 65 డేస్ వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కూడా..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025.. స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆఫర్స్!

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

Big Stories

×