OTT Movie : ఒక మంచి మసాలా సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పిచ్చెక్కిస్తుంది. ఈ సిరీస్ ఇసాబెల్ (బెల్లీ) అనే టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇద్దరు సోదరులు, కాన్రాడ్, జెరెమియాలతో ఒక లవ్ ట్రయాంగిల్‌లో చిక్కుకుంటుంది. ఈ స్టోరీ కజిన్స్ బీచ్ అనే సుందరమైన సముద్రతీర నేపథ్యంలో జరుగుతుంది. ఈ సిరీస్ పేరు పేమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ అమెరికన్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘The Summer I Turned Pretty’. జెన్నీ హాన్ రాసిన నవల ఆధారంగా ఇది రూపొందింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2022 జూన్ 17 న 7 ఎపిసోడ్‌లతో ప్రీమియర్ అయింది. రెండవ సీజన్ 2023 జూలై 14 న 8 ఎపిసోడ్‌లతో విడుదలైంది. మూడవ సీజన్ 11 ఎపిసోడ్‌లతో 2025 జూలై 16న ప్రీమియర్ అవుతుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 17 వరకు వారానికి ఒక ఎపిసోడ్ విడుదలవుతుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
సీజన్ 1 కథ
బెల్లీ కి తన16వ పుట్టిన రోజు సమీపిస్తున్న సమయంలో, ఆమె తన తల్లి లారెల్ , సోదరుడు స్టీవెన్ తో కలిసి కజిన్స్ బీచ్‌లోని ఫిషర్ బీచ్ హౌస్‌కు వెళుతుంది. ఈ బీచ్ హౌస్ ఒక ఫిషర్ కుటుంబానికి చెందినది. ఇక్కడ లారెల్ తన బాల్య స్నేహితురాలు సుసన్నా, తన ఇద్దరు కొడుకులు, కాన్రాడ్, జెరెమియాతో నివసిస్తుంది. బెల్లీ చిన్నప్పటి నుండి ఈ సోదరులతో వేసవిని గడిపేందుకు ఇక్కడికి వచ్చేది. కాన్రాడ్‌పై ఆమెకు చిన్నతనం నుండి క్రష్ ఉంటుంది. అయితే జెరెమియా ఆమెకు స్నేహితుడిగా ఉంటాడు. ఈ వేసవిలో బెల్లీ గత సంవత్సరం కంటే ఎక్కువగా పరిణతి చెందింది. ఆమె అందం, ఆత్మవిశ్వాసం ఈ సోదరులు ఆమెను కొత్త కోణంలో చూడటానికి కారణమవుతుంది. ఇది ఒక లవ్ ట్రయాంగిల్‌కు దారితీస్తుంది.
బెల్లీ కజిన్స్ బీచ్‌లో తన 16వ బర్త్ డే ని జరుపుకుంటుంది. ఈ సమయంలో ఆమె కాన్రాడ్‌పై తన భావాలను పంచుకోవాలనుకుంటుంది. కానీ అతను మూడీగా ఉంటాడు. అంతేకాకుండా, ఆమెను తన సోదరుడు జెరెమియాతో సన్నిహితంగా ఉండేలా చేస్తాడు. జెరెమియా ఆమె పట్ల స్నేహపూర్వకంగా, ఓపెన్‌గా ఉంటాడు. ఈ సమయంలో, కామ్ అనే స్థానిక అబ్బాయి బెల్లీ పట్ల ఇష్టం పెంచుకుంటాడు. ఆమెకు తన మొదటి బాయ్‌ఫ్రెండ్‌గా మారతాడు. కానీ ఈ సంబంధం తాత్కాలికంగా ఉంటుంది. ఎందుకంటే బెల్లీ హృదయం కాన్రాడ్, జెరెమియా చుట్టూ ఉంటుంది. ఎవరిని లవ్ చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంటుంది.
సీజన్ 2 కథ
సుసన్నా క్యాన్సర్ తో చనిపోయిన తరువాత, దీని ప్రభావం అందరిపై పడుతుంది. ముఖ్యంగా కాన్రాడ్, జెరెమియా, బెల్లీపై ఎక్కువగా ఉంటుంది. బెల్లీ గత వేసవి నుండి కాన్రాడ్‌తో సంబంధంలో ఉంటుంది. కానీ అతను ఆమెను దూరం చేస్తాడు. దీని కారణంగా వారి సంబంధం బ్రేక్ అప్ అవుతుంది. ఇంతలో సుసన్నా బీచ్ హౌస్‌ను ఆమె సోదరి జూలియా అమ్మకానికి పెడుతుంది. ఇది బెల్లీ, కాన్రాడ్, జెరెమియాకు షాక్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు వీళ్ళ బాల్య జ్ఞాపకాలకు కేంద్రంగా ఉంటుంది. బెల్లీ, ఇప్పుడు 17 ఏళ్ల వయసులో, ఈ ఇంటిని కాపాడటానికి, తన గత వేసవి నుండి కాన్రాడ్జె, రెమియాతో తన సంబంధాలను సరిదిద్దుకోవడానికి కజిన్స్‌కు తిరిగి వస్తుంది.
ఇప్పుడు బెల్లీ ట్రయాంగిల్ లవ్ మరింత హాట్ గా మారుతుంది. కాన్రాడ్, జెరెమియా ఇద్దరూ ఆమె పట్ల తమ ఫీలింగ్స్ ను వ్యక్తం చేస్తారు. కాన్రాడ్, బెల్లీతో తన సంబంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని నిలకడలేని తత్త్వం ఆమెను జెరెమియా వైపు వెళ్లేలా చేస్తుంది. జెరెమియా ఆమెకు ఇప్పుడు అన్నిటికీ అండగా ఉంటానని చెప్తాడు. ఇక బెల్లీ, స్టీవెన్, టేలర్, ఫిషర్ సోదరులు బీచ్ హౌస్‌ను కాపాడటానికి ఒకచోట చేరతారు. జూలియాను ఆ ఇంటిని అమ్మకుండా ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో బెల్లీ, జెరెమియా ఏకాంతంగా గడుపుతారు. దీని వాళ్ళ వారి లవ్ ట్రాక్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఆమె మనసు మళ్ళీ కాన్రాడ్ చుట్టూ తిరుగుతుంది.
సీజన్ 3
బెల్లీ ఇప్పుడు కాలేజీ వయస్సులో ఉంటుంది. ఈ సీజన్ బెల్లీ లవ్ ట్రయాంగిల్‌ను ఒక కొలిక్కి తీసుకువస్తుంది. ఆమె కాన్రాడ్, జెరెమియా మధ్య తన ప్రేమని ఎవరితో పంచుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. చివరికి బెల్లీ తన ప్రేమను ఎవరితో పంచుకుంటుంది ? బీచ్ హౌస్ ను అమ్మకుండా వీళ్ళు కాపాడుకుంటారా ? బెల్లీ కి మరో లవ్ స్టోరీ ఏమైనా నడుస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.
Read Also : చెల్లిని చంపిందని దెయ్యంపైనే పగ… చుక్కలు చూపించే అక్క… ఇదెక్కడి మెంటల్ మాస్ రా మావా