BSNL Fiber Plans: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ యాజమాన్యంలోని భారతీ ఎయిర్ టెల్ తో సహా ప్రైవేట్ టెలికాం మేజర్లకు BSNL గట్టి సవాల్ విసిరింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల కోసం పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. జియో హాట్ స్టార్, సోనీలైవ్, హంగామా, లయన్స్ గేట్ ప్లే లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు 1 Gbps వేగంతో 9500 GB నెల వారీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.
BSNL ఫైబర్ రూబీ OTT ప్లాన్ గురించి..
ఈ ప్లాన్ లో భాగంగా వినియోగదారులు 1 నెల, 6 నెలలు, 12 నెలలు, 24 నెలల BSNL ఫైబర్ రూబీ OTT ప్లాన్ ను తీసుకోవచ్చు. కొత్త BSNL బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లపై ఫ్లాట్ రూ.1,000 తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ను సెప్టెంబర్ 13 వరకు పొందే అవకాశం ఉన్నట్లు BSNL సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ప్లాన్ లో భాగంగా BSNL 1Gbps వేగంతో 9500 GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. ఆ తర్వాత వేగం 45Mbpsకి పరిమితం చేయబడుతుంది. వినియోగదారులు జియో హాట్ స్టార్, సోనీలైవ్, హంగామా, లయన్స్ గేట్ ప్లే లాంటి 23 ప్రముఖ OTT యాప్ లకు ఉచిత మెంబర్ షిప్ పొందే అవకాశం ఉంటుంది. అదనంగా, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ కాల్స్ కు నిమిషానికి 1.20 చొప్పున వసూలు చేయబడుతుంది.
BSNL ఫైబర్ రూబీ ప్లాన్ ధర వివరాలు..
BSNL ఫైబర్ రూబీ ప్లాన్ ను 1 నెలకు రూ.4,799, 6 నెలలకు రూ.28,794, 12 నెలలకు రూ.57,588, 24 నెలలకు రూ.1,15,176తో లభిస్తుంది. కొత్త కనెక్షన్లకు రూ.1000 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అదనంగా, BSNL 12 నెలల సబ్ స్క్రిప్షన్ పై ఒక నెల ఉచిత సేవలను, 24 నెలల ప్లాన్‌పై 3 నెలల ఉచిత సేవలను అందిస్తోంది.
Unleash 1 Gbps Speed with BSNL’s Azadi Offer!
Get 9,500 GB/month and save ₹1,000/month!
Book your Fiber Ruby OTT Plan today and enjoy streaming, gaming, and surfing at unstoppable speeds.Limited-period offer. T&C apply.#BSNL #BSNLFiber #BSNLAzadiOffer #HighSpeedInternet… pic.twitter.com/xN8SVndqkl
— BSNL India (@BSNLCorporate) August 15, 2025
జియో, ఎయిర్ టెల్ కు BSNL సవాల్..
BSNL తాజాగా తీసుకొచ్చి ఫైబర్ రూబీ OTT ప్లాన్ ఎయిర్ టెల్, జియో లాంటి మేజర్ టెలికాం రంగాలకు గట్టి సవాల్ విసిరే అవకాశం ఉంటుంది. జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పోటీ పడటానికి BSNL బ్రాడ్ బ్యాండ్ సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. గత సంవత్సరం చివరి రెండు నెలల్లో దాని నెట్ వర్క్ కు 65 లక్షలకు పైగా కొత్త సబ్ స్క్రైబర్లను యాడ్ చేసుకుంది. ఇక పోటీ ధరలతో BSNL ఇప్పుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ ఎయిర్ టెల్ లాంటి సంస్తలకు గట్టి సవాలును విసురుతోంది.
Read Also: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!