BigTV English

BSNL: బుర్రపాడు రా సామీ.. రూ.6లకే 2జీబీ డేటా.. ఏకంగా 395 రోజుల పాటు..!

BSNL: బుర్రపాడు రా సామీ.. రూ.6లకే 2జీబీ డేటా.. ఏకంగా 395 రోజుల పాటు..!

BSNL : దేశ వ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు పెరిగిపోయారు. అదే క్రమంలో ఇంటర్నెట్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు వంద లేదా రెండు వందలతో రీచార్జ్ చేసుకుంటే.. దానికి టాక్ టైంతో పాటు 1జీబీ లేదా 2జీబీ డేటా అందించేవారు. కానీ గత కొన్నేళ్ల నుంచి జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ కంపెనీల పుణ్యమా అని అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. రోజు వారి డేటా వాడే వారు అధికం అయిపోయారు. ఇక ఇదే అదునుగా భావించిన టెలికాం సంస్థలు మంత్లీ, ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేశాయి.


ఇటీవలే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను అధికం చేశాయి. దీంతో ఆ కంపెనీ సిమ్ కార్డుల వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఒకేసారి భారీ మొత్తంలో రీఛార్జ్ ధరలు పెంచేయడంతో ఖంగుతిన్నారు. ఇందులో భాగంగానే 3 నెలల రీఛార్జ్ చేసుకునే వారు ఇప్పుడు 1 నెలకే చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇదే క్రమంలో ప్రముఖ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన BSNL తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించింది.

ఇదే సరైన సమయమని భావించిన బిఎస్‌ఎన్‌ఎల్.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్ ధరల కంటే మరింత తక్కువకే నెలవారి ప్లాన్‌లు తీసుకువచ్చింది. దీంతో ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కొన్ని లక్షలాది మంది వినియోగదారులు bsnl నెట్‌వర్క్‌కి ఛేంజ్ అయ్యారు. అదే క్రమంలో బిఎస్ఎన్ఎల్ మరింత మందిని ఆకట్టుకోవడం కోసం కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తుంది. అతి తక్కువ ధరలో రీఛర్జ్ ప్లాన్‌లను తీసుకువస్తూ అదరగొడుతోంది.


Also Read: దెబ్బ మీద దెబ్బ.. BSNL నుంచి మూడు చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!

అయితే BSNL ఇప్పటికే ఎన్నో రీఛార్జ్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరొక ప్లాన్‌తో వచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది. కేవలం రూ.6లతో డైలీ 2జీబీ డేటా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఏ ప్లాన్.. దాని వ్యాలిడిటీ, ఇతర వివరాలు తెలుసుకుందాం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 నెలల రీఛార్జ్ ప్లాన్‌తో BSNL వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రూ.2399 లతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్‌ సుమారు 9 కోట్ల మంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 395 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు.

అంటే దాదాపు 13 నెలలు. ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వారు ఏ నెట్‌వర్క్‌లోనైనా 395 రోజులు అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చు. ఇక ఇంటర్నెట్ కూడా అధికంగా అందించబడుతుంది. 395 రోజుల పాటు వినియోగదారులు 790 జిబీ డేటాను వినియోగించుకోవచ్చు. డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా వాడుకోవచ్చు. దీనిబట్టి చూస్తే డైలీ 2జీబీ డేటా కోసం కేవలం రూ.6 మాత్రమే ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే 100 SMS లు కూడా పొందుతారు. అంతేకాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తాయి. అందువల్ల ఒక మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇదే సరైన సమయం

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×