BigTV English

Tollywood Heroes sisters: సినీ హీరోల సిస్టర్ బాండింగ్… నిర్మాణ రంగంలోనూ తమదైన ముద్ర

Tollywood Heroes sisters: సినీ హీరోల సిస్టర్ బాండింగ్… నిర్మాణ రంగంలోనూ తమదైన ముద్ర

Tollywood Heroes sisters turn into producers achieve success: సోదరసోదరీ బంధానికి ఆత్మీయతాభావ సుగంధం పూస్తే వెదజల్లే స్వచ్ఛమైన సువాసనే రక్షాబంధన్. సృష్టిలో తీయనైనది స్నేహబంధం అయితే హృదయాలనుంచి తీసేయలేనిది సోదరసోదరీ బంధం. ఒకే కొమ్మకు పూసిన రెండు పువ్వులు. ఒకే కడుపును పంచుకున్న రెండు ప్రాణాలు. రక్తసంబంధాన్ని, పేగు బంధాన్ని జీవితాంతం గుర్తుంచుకునే రెండు ప్రాణులు. నేడు రక్షాబంధన్ దినోత్సవం. సినిమా హీరోలు రీల్ లైప్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ చెల్లెళ్లతో అనుబంధాన్ని కలిగివుంటారు. అయితే కొందరు హీరోలు సినిమా రంగంలో అగ్రకథానాయకులుగా కొనసాగుతుంటే వారి సహోదరిలు సినిమా నిర్మాణ రంగంలో అపురూప విజయాలు అందుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకటే రంగం.. కాకపోతే ఒకరు హీరో మరొకరు నిర్మాత. ఇద్దరూ వారివారి రంగాలలో దూసుకుపోతున్నారు. వాళ్లెవరో ఈ రాఖీ పండుగ సందర్భంగా తెలుసుకుందాం..


మహేష్ సోదరి మంజుల

అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగానే రాణిస్తున్నారు. ఆయన చెల్లెలు నాగసుశీల నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. హీరో సుశాంత్ తల్లి అయిన నాగ సుశీల కరెంట్,అడ్డా,ఆటాడుకుందాం..రా అనే చిత్రాలు నిర్మించారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తున్నారు. హీరో మహేష్ బాబు సోదరి ఘట్టమనేన మంజుల మహేష్ బాబుతో నాని, పోకిరి వంటి సినిమాలు తీశారు. కావ్యాస్ డైరీ, షో వంటి సినిమాలతో మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. సమంతను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఏం మాయ చేశావే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ నిర్వాహకురాలిగా తన బాధ్యత నెరవేరుస్తోంది.


రామ్ చరణ్ సోదరి సుస్మిత

రామ్ చరణ్ మెగా వారసుడిగా గ్లోబల్ రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్ సిస్టర్ సుస్మిత తో బాండింగ్ ఎక్కవే. సుస్మిత చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే నిర్మాతగా మారి ఆమె 2021లో సేనాపతి అనే మూవీని చేశారు. ఆతర్వాత 2020 సంవత్సరంలో షూట్ అవుట్ ఎట్ ఆలేర్ అనే టీవీ సీరియల్ చేశారు. 2023లో శ్రీదేవి-శోభన్ బాబు అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సంతోష్ శోభన్ ఆ సినిమాకు హీరో. సినిమా నిర్మాణ వ్యవహారాలను జాగ్రత్తగా గమనిస్తూ నిర్మాణ రంగంలో దూసుకునోతున్నారు సుస్మిత. ఇక గ్లోబల్ పాన్ ఇండియా హీరోగా పలు విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.

ప్రభాస్ సోదరి ప్రసీద

హీరో కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు. ప్రభాస్ వారిని తన సొంత చెల్లెళ్లుగా భావిస్తుంటాడు. పెద్ద సోదరి ప్రసీద ప్రభాస్ తో రాధేశ్యామ్ మూవీని తీశారు. అయితే అది ఆశించినంతగా విజయం సాధించలేదు. హీరో నితిన్ సోదరి కూడా అభిరుచి కలిగిన నిర్మాత. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలను రూపొందించారు. ఇక మంచు లక్ష్మి కూడా నిర్మాణ రంగంలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. సోదరుడు మంచు విష్ణు రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప నిర్మాణ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలా చాలామంది హీరోల సిస్టర్స్ నిర్మాణ రంగంలో అపూర్వ విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోతున్నారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×