Redmi Note 15 Pro Plus: మొబైల్ ఫోన్ల ప్రపంచంలో ప్రతి రోజు కొత్త మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. కానీ కొన్ని ఫోన్లు మాత్రం వినియోగదారుల దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తాయి. అలాంటి ఫోన్‌గానే మార్కెట్లోకి అడుగుపెట్టింది రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు చూస్తే నిజంగానే ఇది ఫ్లాగ్‌షిప్ మోడళ్లకే పోటీ ఇస్తుందనిపిస్తుంది.
సూపర్ కెమెరా
మొదటగా ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ 200ఎంపి కెమెరా. ఇంతకుముందు 100ఎంపి, 108ఎంపి కెమెరాలున్న ఫోన్లు చూసాం కానీ ఇప్పుడు 200ఎంపి సెన్సార్‌ను అందిస్తున్న రెడ్‌మి, మధ్యస్థాయి వినియోగదారుల కోసం పెద్ద బహుమతి ఇచ్చినట్టే. ఈ కెమెరాతో తీసిన ఫొటోలు ఎంత జూమ్ చేసినా డీటైల్‌గా, స్పష్టంగా కనబడతాయి. రాత్రిపూట ఫోటోగ్రఫీకి ప్రత్యేకమైన నైట్ మోడ్ కూడా అందిస్తున్నారు. దీంతో తక్కువ లైటింగ్‌లో కూడా క్వాలిటీ ఫొటోలు రానున్నాయి.
బ్యాటరీ – రెండు రోజులపాటు
8400ఎంఏహెచ్ బ్యాటరీని అందించడం నిజంగా స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో పెద్ద మైలురాయే. సాధారణంగా మార్కెట్లో 5000 లేదా 6000ఎంఏహెచ్ బ్యాటరీలే ఎక్కువగా ఉంటాయి. కానీ రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్‌లో 8400ఎంఏహెచ్ పవర్ అందించడంతో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, రెండు రోజులపాటు సులభంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం కొద్దిసేపులోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Also Read: After Brushing: బ్రష్ చేసిన వెంటనే ఆ..పని చేస్తున్నారా? అయితే త్వరగా మానేయండి
డిస్‌ప్లే ప్రీమియం ఫీల్ ఇస్తుంది
విషయానికి వస్తే – 6.9 ఇంచుల సూపర్ AMOLED డిస్‌ప్లే, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. దీని వలన గేమింగ్, వీడియోలు చూడడం, సోషల్ మీడియా వాడకం అన్నీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. పంచ్-హోల్ డిజైన్‌తో వచ్చే స్క్రీన్, డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన ఈ ఫోన్ డిస్‌ప్లే నిజంగా ప్రీమియం ఫీల్ ఇస్తుంది.
ప్రాసెసర్ -స్టోరేజ్- ర్యామ్
తాజా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ సిరీస్ చిప్ సెట్‌ని అందించారు. దీని వలన గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఎలాంటి లాగింగ్ లేకుండా ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఏఐ ఆధారిత పనితీరులో కూడా ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక స్టోరేజ్, ర్యామ్ పరంగా కూడా ఫోన్ బలంగా నిలుస్తోంది. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ ఫోన్, అవసరమైతే 1టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ సపోర్ట్ కూడా కలిగివుంది.
డిజైన్ – కనెక్టివిటీ ఫీచర్లు
అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం లుక్ ఇచ్చారు. ఫోన్ స్లిమ్‌గా, లైట్ వెయిట్‌గా ఉండటమే కాకుండా నాలుగు వేరే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. సెక్యూరిటీ పరంగా అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4 వంటి తాజా కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.
ధర ..అధికారికంగా ప్రకటించలేదు
అధికారికంగా రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ ధరను కంపెనీ సుమారు రూ.29,999 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ ధరలో ఇంతటి ఫీచర్లను ఇవ్వడం వలన ఇది నిజంగానే ఫ్లాగ్‌షిప్ కిల్లర్ అనిపిస్తోంది.