2030 Economy: ప్రస్తుతం 2025, కానీ 2030 నాటికి ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా. ఆర్థిక నిపుణుడు అభిజిత్ చోక్షి దీని గురించి కీలక విషయాలను వెల్లడించారు. 2030 నాటికి మీరు ఎక్కువ సంపాదిస్తారు. కానీ అదే సమయంలో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే మీ డబ్బుకు విలువ తగ్గుతుందన్నారు. ప్రస్తుతం లీటర్ పాలకు 60 రూపాయలు ఉంటే, వచ్చే ఐదేళ్లలో ఇదే పాలు 75 రూపాయలకు చేరతాయన్నారు. ఇది కనబడే ద్రవ్యోల్బణమని, వేతనాలు పెరిగినా, మీ ఖర్చులు ఆ వృద్ధిని మించిపోతాయన్నారు.
ద్రవ్యోల్బణం అంటే ఖరీదైనవేనా?
చాలామంది ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు పెరగడం అని మాత్రమే భావిస్తారు. కానీ చోక్షి చెబుతున్నది ఏంటంటే, ద్రవ్యోల్బణం రెండు ముఖాలతో వస్తుందన్నారు. ఒకటి మనం చూసే ధరల పెరుగుదల. రెండోది మనకు తెలియకుండానే ఖర్చులను పెంచే “కనిపించని ద్రవ్యోల్బణమని పేర్కొన్నారు. ఈ రెండో దానిని “Shrinkflation” అంటారు. మీ బిస్కెట్ ప్యాకెట్ అదే రేటుకే వస్తుంది. కానీ బిస్కెట్లు 10 నుంచి 8కి తగ్గిపోయన్నారు. అదే పద్ధతిలో, మీ లంచ్ బాక్స్ చిన్నదైపోయింది. కానీ బిల్ అదే ఉంటుందన్నారు. ఇదీ ద్రవ్యోల్బణపు మాయాజాలంలో భాగమేనని చెప్పారు.
దోచుకుంటున్న ధోరణి!
అభిజిత్ చోక్షి అన్నట్లుగా మీ జీతం పెరిగింది. కానీ అది జీవన ఖర్చులకు సరిపోవడం లేదంటే మీరు తక్కువ సంపాదిస్తున్నట్లు కాదన్నారు. మీరు మెల్లగా, నిశ్శబ్దంగా దోచుకోబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆర్థిక మార్పే కాదు. ఇది ఒక నియంత్రణ వ్యవస్థ, ఇది మీ సంపదను నెమ్మదిగా ఎండగడుతుందన్నారు. ఒకప్పుడు 10 రూపాయల మాగీ ప్యాక్ ఇప్పుడు అది 15, ప్యాకెట్ చిన్నది, ఫ్లేవర్ లైట్. 1BHK ఇంటికి ఒకప్పుడు 20 లక్షలు చాలు, కానీ ఇప్పుడు అదే స్థలం 1 కోటి. ఇదే చోక్షి చూపించిన ద్రవ్యోల్బణ ఫార్ములా.
Read Also: Realme Narzo 80 launch: అగ్గువ ధరకే 6000mAh బ్యాటరీ …
దీనికి గల కారణాలు..
-చోక్షి తన పోస్ట్‌లో కొన్ని దీనికి గల కారణాలను కూడా ప్రస్తావించారు.
-కేంద్ర బ్యాంకుల డబ్బు ముద్రణ: ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే, ప్రతి రూపాయికి విలువ తగ్గుతుంది.
-కార్పొరేట్ వ్యూహాలు: ధరలు పెంచకుండా నాణ్యత తగ్గించడం.
-ప్రపంచ రాజకీయాలు: చమురు ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు.
-డిజిటల్ ద్రవ్యోల్బణం: UPI ఛార్జీలు, సబ్‌స్క్రిప్షన్ ఫీజుల పెరుగుదల.
జీవితంలో పెద్ద బిల్లులు, చిన్న భాగాలు!
2030కి మీరు ఎదుర్కొనే దృశ్యం ఇలా ఉండొచ్చన్నారు. సబ్‌స్క్రిప్షన్ ఫీజులు అన్నీ పెరగడం, బిజినెస్ క్లాస్ టికెట్ కాదు, బస్సు టికెట్ కూడా వందల్లోకి చేరనుంది. ఇంటి అద్దె మీ జీతంలో దాదాపు సగం పీల్చేస్తోంది. మెను కార్డులో 2 చాపతీలు కాకుండా “చిన్న ప్లేట్”గా మారుతుంది. మీరు సంపాదిస్తున్నట్లు అనిపిస్తున్నా, మీరు ‘క్లిష్ట జీవితం’లో బ్రతకవచ్చన్నారు. ఇది భయపెట్టే స్టోరీ కాదని, వ్యాపార యుద్ధమన్నారు.
మరింత ఖరీదైనదిగా
ఈ క్రమంలో మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండలన్నారు. ఇది కేవలం ఎకానమీ గణాంకాలు కాదని, మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే విషయాలన్నారు. ఇప్పటి నుంచే అనవసర ఖర్చులు తగ్గించి సేవింగ్ చేసుకోవాలని, లేదంటే మీ ఫ్యూచర్ మరింత ఖరీదైనదిగా మారుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి రూపాయి ఖర్చుపై పదే పదే ఆలోచిస్తూ ఖర్చు చేయాలన్నారు. ఇప్పటి నుంచే నిజమైన ఆస్తులైన బంగారం, భూములపై పెట్టుబడి పెట్టాలన్నారు.