Heroine: సినిమా పరిశ్రమ అంటే తళుకుల ప్రపంచం. కెమెరా ముందు ఓ హీరోయిన్ ఎంత అందంగా, కాంఫిడెంట్‌గా కనిపించినా… కెమెరా వెనుక ఆమె ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉంటాయి. అందరికీ షేర్ చేసుకోలేని సంఘటనలు, అంతర్లీనంగా తట్టుకోవాల్సిన బాధలు. కొందరు భయంతో నోరు మూసుకుంటే, కొందరు మాత్రం ధైర్యంగా నిజాన్ని బయటపెడతారు. ఇలాంటి వేరే లెవల్ ధైర్యాన్ని చూపించింది మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఓ అవమానకరమైన సంఘటనను గుర్తు చేసుకుంది. ఓ సినిమా సెట్లో హీరో తాను ఎదుర్కొన్న అవమానాన్ని బయట పెట్టింది.
“ఆ హీరో డ్రగ్స్ తీసుకుని… నా ముందే బట్టలు మార్చుకోమన్నాడు” – విన్సీ షాకింగ్ కామెంట్స్
విన్సీ చెబుతున్నదాని ప్రకారం, ఆ హీరో షూటింగ్ కు డ్రగ్స్ తీసుకుని వచ్చేవాడు. ఒకసారి తనను అసభ్యంగా అడగడంతోపాటు, “నీ కాస్ట్యూమ్స్ చేంజ్ నా ముందే చేయి” అంటూ ఒత్తిడి చేశాడట. తన మీద అంతగా దౌర్జన్యం చూపించిన ఈ ఘటనను, తన జీవితంలో అత్యంత అసహ్యకర సంఘటనగా అభివర్ణించింది. “ఆ సమయంలో నాకు తెలిసినంతమంది ముందు అతను అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ ఎవరూ ఏమీ చెప్పలేదు. నా లైఫ్‌లో ఆ డేగ్రేడింగ్ మూమెంట్ మర్చిపోలేను” అని చెప్పింది విన్సీ.
“డ్రగ్స్ తీసుకునే వాళ్లతో ఇకపైన పనిచేయను”
ఈ సంఘటన తర్వాత తాను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పింది విన్సీ – “ఇక మీదట డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నేను కలిసి పనిచేయను.” ఇది తన అవకాశాలను తగ్గించవచ్చు అన్న విషయంలో ఆమెకి క్లారిటీ ఉంది. అయినా తన విలువలు, స్వాభిమానాన్ని కాపాడుకోవడమే ముఖ్యం అని చెప్పింది.
ఇంటస్ట్రీలో మార్పు రావాలంటే… ఎవరో ముందడుగు వేయాలి
విన్సీ మాట్లాడిన మాటలు ఇప్పుడు మల్లూవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీపై జస్టిస్ హేమ కమిటీ లైంగిక వేధింపులపై సీరియస్‌గా స్పందించగా, విన్సీ వెల్లడి ఈ సమస్యకు మరోసారి దృష్టి పెట్టేలా చేసింది.
విన్సీ చెప్పిన సంఘటన ఒక్కడి విషయంలోనే పరిమితమా, లేదా ఇదొక పెద్ద సమస్యా అన్నది తెలియాల్సి ఉంది. కానీ తన అనుభవాన్ని అందరితో పంచుకోవడం ద్వారా ఆమె చూపిన ధైర్యం – మరెందరో పండుగల వేషాల్లో కనిపించే హీరోయిన్ల వెనుక ఉన్న నిజాన్ని బయటపెడుతోంది.
విన్సీ – అభినందించదగ్గ నటి
2019లో “రేఖ” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విన్సీ, తొలి సినిమాతోనే మలయాళ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. టాలెంట్ ఉన్నప్పటికీ, గౌరవంతో పని చేయాలన్న విజ్ఞానం కూడా ఆమెలో ఉంది. ఆమె స్పందన – పరిశ్రమలో ఉద్యోగుల మధ్య వాతావరణం ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికీ సూచనగా నిలవాలి. వయసుతో సంబంధం లేకుండా, స్థాయితో సంబంధం లేకుండా… వర్క్ ప్లేస్ అంటే సేఫ్ స్పేస్ అవ్వాలి. విన్సీ వాయిస్ ఎత్తడం ఒక మంచి ఉదాహరణ. మరెందరో ఇలా ధైర్యంగా మాట్లాడే రోజులు రావాలని ఆశిద్దాం.