E-Paper
Advertisement

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం
Advertisement

క్యాబ్ బుకింగ్‌లు ఖరారు కాకముందే వినియోగదారుల నుండి అదనపు చెల్లింపులు కోరినందుకు ఓలా ఆపరేటర్ పై కొరడా ఝులిపించింది కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ. ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సీసీపీఏ భారీ జరిమానా విధించింది. అంతేకాదు ఆ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది.

ఓలాకు భారీగా జరిమానా

క్యాబ్‌ బుక్‌ చేసుకునే సమయంలో అదనపు డబ్బులు చెల్లించేలా కస్టమర్లు ప్రోత్సహిస్తున్న ఓలా తీరుపై భగ్గుమంది కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ- సీసీపీఏ. దీనిపై గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా ఓలా తీరు ఏ మాత్రం మారినట్ట కనిపించలేదు. ఈ తరహా పద్దతి వినియోగదారులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రూ.10 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు యాప్‌లో ఆ తరహా ఫీచర్ వెంటనే తొలిగించాలని ఆదేశించింది. ఓలా క్యాబ్‌ సేవలు నిర్వహించే ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఆ జరిమానా విధించింది. ఈ మేరకు సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ముందస్తు ‘టిప్’, నిలిపి వేయాలని ఆదేశం

Advertisement

ఈ ఏడాది నవంబర్ 10న ఇచ్చిన ఉత్తర్వులో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం ఓలా అడ్వాన్స్ టిప్పింగ్ ఫీచర్ తప్పుదోవ పట్టించే ప్రకటన, అన్యాయమైన వాణిజ్య పద్ధతి, అన్యాయమైన ఒప్పందం కిందకు వస్తుందని CCPA నిర్ధారించింది.  అదనంగా చెల్లించడం వల్ల ప్రయాణం వేగంగా లభించే అవకాశాలు మెరుగుపడతాయన్న ప్లాట్‌ఫారమ్ వాదనకు తప్పుబట్టింది.

టిప్‌ ఇస్తే త్వరగా రైడ్‌ లభించే అవకాశాలు ఉంటుందని, త్వరగా రైడ్‌ కన్ఫర్మేషన్‌ పొందాలంటే అదనంగా చెల్లించండి సందేశం యాప్‌లో ఉన్నట్లు సీసీపీఏ గుర్తించింది. డ్రైవర్‌ కోసం అన్వేషణ జరుగుతున్న సమయంలో ఆ తరహా సందేశాలు ముందుగా నిర్ణయించిన చెల్లింపుపై కనిపించేవి. అదనపు డబ్బులు చెల్లిస్తే క్యాబ్‌ త్వరగా దొరుకుతుందనే అభిప్రాయం కస్టమర్లలో కలుగుతోందని పేర్కొంది.

Advertisement

ALSO READ: ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

ఓలా అడ్వాన్స్ టిప్పింగ్ ఫీచర్‌కు సంబంధించి గతేడాది మే 16న CCPAకి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టింది ఆ సంస్థ. డ్రైవర్ తమ బుకింగ్‌ను అంగీకరించే వరకు వేచి ఉన్నప్పుడు అదనంగా చెల్లించమని వినియోగదారులను ప్రోత్సహించే సందేశాలను ఆ యాప్ ప్రదర్శించింది. టిప్ ఇవ్వడం వలన త్వరగా రైడ్ పొందే అవకాశాలు పెరగవచ్చు. ప్రారంభంలో వినియోగదారులకు రూ.10, రూ.20, రూ. 30, రూ. 40 అదనపు చెల్లింపు ఎంపికలను అందించారు. ఆ తర్వాత ఈ మొత్తాలను అమాంతంగా పెంచేయడంతో సీసీపీఏ రంగంలోకి దిగింది.

Related News

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన HR ఉద్యోగికి ప్రమోషన్.. కొన్ని నెలల తరువాత అతడికి భారీ షాక్

సామాన్యులకు షాక్.. వడ్డీ రేటు పెంచిన 5 బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే

Big Stories

Advertisement
×