E-Paper
Advertisement

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!
Advertisement

Rural Business Ideas: ఒకప్పుడు మంచి ఆదాయం సంపాదించాలంటే పల్లెటూర్లు వదిలి పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూనే నెలకు రూ.లక్షల్లో సంపాదించే స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. పల్లెల్లో ఉంటూ భారీగా ఆదాయం అర్జించగల వ్యాపారాలపై ఓ లుక్కేయండి.

పాడి పరిశ్రమతో స్థిరమైన ఆదాయం

గ్రామాల్లో పాడి పశువులకు కొదవే ఉండదు. 4 నుండి 5 మేలుజాతి ఆవులు లేదా గేదెలతో చిన్నపాటి పాడి పరిశ్రమను ప్రారంభించవచ్చు. ఊర్లల్లో పశువులకు కావాల్సిన గడ్డి, దాణా సులభంగా లభిస్తుంది కాబట్టి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి అయిన పాలను సమీప పట్టణాల్లోని హోటళ్లు, స్వీట్ షాపులు లేదా డైరీ కేంద్రాలకు విక్రయించడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు.

రూ. లక్ష వరకూ ఆదాయం..!

Advertisement

ప్రస్తుతం చాలామంది పాడి పరిశ్రమ రంగంలో నెలకు రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. 6 ఆవులు, 3 గేదెలను పెంచుతున్న ఓ రైతు ఖర్చులన్నీ పోను నెలకు నికరంగా రూ. 55 వేల నుండి రూ. 60 వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాపారంలో పశువుల సంరక్షణ చాలా ముఖ్యం. వాటికి ఎప్పటికప్పుడు టీకాలు వేయించడం, ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.

చిన్న గదిలోనే పుట్టగొడుగుల సాగు

గ్రామంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే మరో అద్భుతమైన వ్యాపారం పుట్టగొడుగుల పెంపకం. దీని కోసం ఎకరాల కొద్దీ భూమి అక్కర్లేదు. ఇంట్లోని చిన్న గది నుంచే ఎంచెక్కా స్టార్ట్ చేయెుచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో భాగంగా ముందుగా గోధుమ లేదా వరి గడ్డిలో అవసరమైన పోషకాలను కలిపి కంపోస్ట్ తయారు చేస్తారు. ఈ ప్రక్రియకు సుమారు నెల రోజుల సమయం పడుతుంది.

పట్టణాలు, నగరాల్లో యమా డిమాండ్!

Advertisement

ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. స్థానిక మార్కెట్లలో కూడా వీటికి మంచి ధర పలుకుతోంది. నగరాల్లోని డీమార్ట్, విజేత, మోర్, రత్నదీప్ వంటి సూపర్ మార్కెట్లలోనూ పుట్టగొడులను విక్రయిస్తున్నారు. ఆయా సంస్థలతో టైఅప్ అయ్యి వాటికి పుట్టగొడుగులు విక్రయించడం ద్వారా నెలకు రూ.లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

కూరగాయల సాగుతో అదనపు రాబడి

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అయితే సంప్రదాయ పంటలైన వరి, గోధుమలతో పాటు సాగు పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. పొలంలోని కొంత భాగంలో పచ్చిమిర్చి, కాలిఫ్లవర్, టమాటా, బెండకాయ వంటి కూరగాయలను సాగు చేయడం వల్ల తక్కువ సమయంలోనే చేతికి డబ్బు అందుతుంది.

Also Read: మద్యం మత్తులో వేధింపులు.. కత్తితో పొడిచి పొడిచి భర్తను చంపిన భార్య

ఆర్గానిక్ కూరగాయాలకు క్రేజ్!

ఈ రోజుల్లో రైతు బజార్లలో దొరికే సాధారణ కూరగాయాల కంటే ఆర్గానికి వెజిటేబుల్స్ (ఎరువులు వాడని కూరగాయాలు) కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆశక్తి చూపిస్తున్నారు. వీటికి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో భారీగా డిమాండ్ పెరుగుతోంది. సేంద్రియ పద్దతుల్లో పండించిన కూరగాయాలను నేరుగా సూపర్ మార్కెట్లు, అపార్ట్ మెంట్లలోని వారికి విక్రయించడం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో గెలుస్తాం…150 కోట్ల భార‌తీయులు త‌ల దించుకునేలా చేస్తాం!

Tags

Related News

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన HR ఉద్యోగికి ప్రమోషన్.. కొన్ని నెలల తరువాత అతడికి భారీ షాక్

సామాన్యులకు షాక్.. వడ్డీ రేటు పెంచిన 5 బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే

ఒకప్పుడు ఫైర్ ఇంజన్లు కడిగాడు.. నేడు రూ. 2,100 కోట్ల కంపెనీకి అధిపతి.. 27 ఏళ్ల కుర్రాడి గ్రేట్ సక్సెస్!

65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

గృహిణులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.1 లక్ష పెట్టుబడితో.. ఇంటి నుంచే చేయగల 4 సూపర్ బిజినెస్‌లు!

తక్కువ జీతంతో సొంతూరిలో ఉండాలా? లేక ఎక్కువ జీతం కోసం హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లాలా?

Big Stories

Advertisement
×