Gold Prices: బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తున్నాయి. నవంబర్ 6 నుంచి నవంబర్ 13 వరకు హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర లక్షా 31 వేల 500 నుంచి 1 లక్షా 26 వేల 950కి దిగివచ్చింది. అంటే ఒక్క వారంలోనే 4,550 రూపాయలు తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ బంగారం ధర కూడా 1 లక్షా 43 వేల 460 నుంచి లక్షా 38,490 రూపాయలకి పడిపోయింది. దీనితో 10 గ్రాములపై 4,970 రూపాయల మేర తగ్గుదల నమోదైంది.
బంగారం ధరలకు బ్రేక్..
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఈ వారం సుమారు 3.6 శాతం నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు, డాలర్ బలపడటం పసిడిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
రూ. 1.20 లక్షలకు పడిపోయే ఛాన్స్!
వీటన్నింటి నేపథ్యంలో మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం బంగారం ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే భారత మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర సుమారు లక్షా 34వేల రూపాయల స్థాయికి దిగివచ్చే అవకాశం ఉంది. అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగి అంతర్జాతీయ ధర 3 వేల 400 డాలర్లకు చేరితే.. భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 1 లక్షా 20 వేలకే పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.
Also Read: హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు