E-Paper
Advertisement

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు
Advertisement

Bombay Sweet Shop success story| స్వీట్స్ అంటే ఇష్టంలేని భారతీయులుండరు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఏ వేడుక జరిగినా మిఠాయిలు ఉండాల్సిందే. అయితే ఎప్పటినుంచో మనం తింటున్న సంప్రదాయ స్వీట్లనే కొత్త రుచులతో అందిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు పారిశ్రామికవేత్తలకు వచ్చిన ఈ ఆలోచనే ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది.

ముంబైకి చెందిన సమీర్ సేథ్, యష్ భనాగే కలిసి ప్రారంభించిన బాంబే స్వీట్ షాప్ ఇప్పుడు ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి చేరుకుంది. అసలు వీరికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? చిన్న ప్రయత్నాన్ని ఇంత పెద్ద వ్యాపారంగా ఎలా మార్చారు? తెలుసుకుందాం.

బాంబే స్వీట్ షాప్ ప్రారంభం వెనుక ఆసక్తికరమైన కథ

Advertisement

బాంబే స్వీట్ షాప్ 2020 మార్చిలో ముంబైలో ప్రారంభమైంది. హంగర్ Inc. హాస్పిటాలిటీ కంపెనీ ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ఈ సంస్థకు ది బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, వెరోనికాస్, పాపాస్ వంటి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సహ వ్యవస్థాపకుడు యష్ భనాగేకి ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఓ ఆలోచన వచ్చింది. అక్కడ విదేశీ స్వీట్లను విక్రయించే ప్రీమియం షాప్స్ చూశారు. అయితే భారతీయ సంప్రదాయ మిఠాయిలకు అలాంటి గుర్తింపు కనిపించలేదు.
దీంతో భారతీయ స్వీట్లను కూడా ఆధునికంగా, ఆకర్షణీయంగా అందించాలని నిర్ణయించుకున్నారు. అలా బాంబే స్వీట్ షాప్ ఆలోచనకు రూపం వచ్చింది.

సంప్రదాయ స్వీట్లకు కొత్త రుచులు

ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొదటి బాంబే స్వీట్ షాప్ ప్రారంభమైంది. విల్లీ వోంకా చాక్లెట్ ఫ్యాక్టరీ తరహాలో ఈ స్టోర్‌ను రూపొందించారు.
సాధారణ మిఠాయిలతో పాటు కొత్త రకాల స్వీట్లను కూడా పరిచయం చేశారు. చాక్లెట్ బటర్‌స్కాచ్ బార్క్స్, మూడు పొరల చాక్లెట్ ఫడ్జ్, డార్క్ చాక్లెట్ కాజు కట్లీ వంటి ప్రత్యేక వంటకాలను అందించారు.
అంతేకాకుండా పాశ్చాత్య డెజర్ట్ తయారీ పద్ధతులను భారతీయ స్వీట్లతో కలిపారు. కాఫీ రసగుల్లా తిరమిసు, వెరీ బెర్రీ కలాకండ్ చీజ్‌కేక్, ఘేవర్ టార్ట్స్ వంటి కొత్త రుచులను తీసుకొచ్చారు.
స్వీట్లతో పాటు స్నాక్స్‌లోనూ ప్రయోగాలు చేశారు. చిల్లీ చీజ్ భుజియా, భాకర్‌వాడీ డేట్స్ కచోరీ, మద్రాస్ కరివేపాకు చిక్కీ వంటి రుచులను పరిచయం చేశారు.

లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ వ్యాపారం

Advertisement

మొదటి స్టోర్ ప్రారంభించిన 10 రోజులకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభమైంది. దీంతో వ్యాపారం ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
అయితే వ్యవస్థాపకులు వెంటనే ఆన్‌లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఆర్డర్లు, డెలివరీ సేవల ద్వారా వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందించారు. ఈ నిర్ణయం వ్యాపారాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది.

Also Read: ఉద్యోగం వదిలి వ్యవసాయం.. ఎకరాకు రూ.30 లక్షలు ఆదాయం.. ఆంధ్రా యువకుడి భలే ఐడియా

5 స్టోర్లు, 20 డార్క్ స్టోర్లతో రూ.100 కోట్ల ఆదాయం

Inc42 మీడియా కథనం ప్రకారం.. బాంబే స్వీట్ షాప్ వార్షిక ఆదాయం సుమారు రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ముంబైలో 5 ప్రత్యక్ష స్టోర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా 20 డార్క్ స్టోర్లను నిర్వహిస్తున్నారు. స్టార్‌బక్స్, ఒబెరాయ్ హోటల్స్, ఇండిగో అంతర్జాతీయ బిజినెస్ క్లాస్ విమానాల్లోనూ వీటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
హంగర్ ఇంక్. నిర్వహించే నాలుగు రెస్టారెంట్ల మొత్తం ఆదాయం కంటే ఈ స్వీట్ బ్రాండ్ ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్లు సమాచారం.

Also Read: ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లక్షల ఖరీదు చేసే గిఫ్ట్స్ పంపిస్తున్న అభిమానులు..కానీ ఫ్రీ కాదు.. కొత్త తరహా టార్చర్

కొత్త ఆలోచనతో సంప్రదాయ వ్యాపారానికే కొత్త గుర్తింపు

పాత రుచులను పూర్తిగా మార్చకుండా వాటికి ఆధునిక రూపం ఇవ్వడమే బాంబే స్వీట్ షాప్ విజయానికి ప్రధాన కారణం. వినియోగదారుల అభిరుచులను గుర్తించి కొత్త ప్రయోగాలు చేస్తే సంప్రదాయ ఉత్పత్తులతోనూ భారీ వ్యాపారం నిర్మించవచ్చని ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు నిరూపించారు.

Related News

వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన HR ఉద్యోగికి ప్రమోషన్.. కొన్ని నెలల తరువాత అతడికి భారీ షాక్

సామాన్యులకు షాక్.. వడ్డీ రేటు పెంచిన 5 బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే

ఒకప్పుడు ఫైర్ ఇంజన్లు కడిగాడు.. నేడు రూ. 2,100 కోట్ల కంపెనీకి అధిపతి.. 27 ఏళ్ల కుర్రాడి గ్రేట్ సక్సెస్!

65 ఏళ్ల వయసులో రూ. 20 భోజనంతో ప్రారంభం.. నేడు రూ. 2.5 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

గృహిణులకు గోల్డెన్ ఛాన్స్.. రూ.1 లక్ష పెట్టుబడితో.. ఇంటి నుంచే చేయగల 4 సూపర్ బిజినెస్‌లు!

తక్కువ జీతంతో సొంతూరిలో ఉండాలా? లేక ఎక్కువ జీతం కోసం హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లాలా?

ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!

Big Stories

Advertisement
×