E-Paper
Advertisement

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!
Advertisement

NPDCL Meter: విద్యుత్ మీటర్ రీడింగ్‌లో అక్రమాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మీటర్‌ను బైపాస్ చేసి విద్యుత్ వినియోగాన్ని నిల్ బిల్లులుగా నమోదు చేస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఎన్పీడీసీఎల్ పరిధిలో బడయపడింది. ఒక మీటర్ రీడర్ ఈ అవకతవకలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా గతంలోనే లైన్‌మెన్ గుర్తించి మీటర్‌కు సీల్ ఏర్పాటు చేసినప్పటికీ, తిరిగి మీటర్‌ను బైపాస్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నగదు వసూలు..

మరోవైపు రికార్డుల్లో నిల్ బిల్లులు చూపిస్తూ వినియోగదారుల నుంచి మాత్రం నగదు వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదులు అందడంతో విద్యుత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్పీడీసీఎల్ పరిధిలో..

Advertisement

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అనేది నానుడి. అయితే ఆ నానుడిని నిజం చేసే ఘటన ఎన్పీడీసీఎల్ పరిధిలో జరిగింది. విద్యుత్ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండా, నిల్ బిల్లులు జారీ చేస్తూ ఎన్పీడీసీఎల్ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన ఒక కమర్షియల్ సర్వీసుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో కవిత ధీరావత్ పేరుతో సుమారు ఎనిమిది నెలల క్రితం ఒక కమర్షియల్ విద్యుత్ సర్వీస్ మంజూరైంది.

Also Read: తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!

డబ్బులు వసూలు..

Advertisement

అయితే, వినియోగదారుడు సరైన మీటర్ కనెక్షన్ లేకుండా నేరుగా విద్యుత్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసినప్పటికీ, సంబంధిత మీటర్ రీడర్.. అసలు రీడింగ్‌లను నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీటర్ రీడర్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని నివేదించకుండా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు నిల్ కన్జంప్షన్ బిల్లులను జారీ చేస్తూ, వినియోగదారుడి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలను గుర్తించిన లైన్‌మెన్ సరైన మీటర్ కనెక్షన్ ఏర్పాటు చేసి సీల్ వేసినట్లు తెలిసింది. అయినా అక్రమ విద్యుత్‌ వాడకానికి ఫుల్ స్టాప్ పెట్టకపోవడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీకే ఫిర్యాదు చేయడం గమనార్హం.

నోటీసు జారీ..

ఈ ఇష్యూపై సమర్థుడైన అధికారిని నియమించి సంబంధిత కాలంలో జరిగిన అసలు విద్యుత్ వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు అందింది. అక్రమ వినియోగాన్ని దాచిపెట్టిన మీటర్ రీడర్ పాత్రపై విచారణ జరపాలని, నేరం రుజువైతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిసింది. వినియోగదారుడికి విద్యుత్ చౌర్యం నోటీసు జారీ చేసి, నిబంధనల ప్రకారం వినియోగ చార్జీలు, అపరాధ రుసుముతో కూడిన సప్లిమెంటరీ అసెస్‌మెంట్ బిల్లును వసూలు చేసి సంస్థ నష్టాన్ని భర్తీ చేయాలని ఫిర్యాదులో స్పష్టంచేశారు. మరి ఈ అంశంపై సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. సంస్తకు నష్టం చేకూరేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

Also Read: తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!

Tags

Related News

హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు

వీసీ సజ్జనార్ విషయంలో ఏం జరిగింది? 14 నెలలకే బదిలీ ఎందుకు? పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి.. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా, 8 మంది జవాన్ల పరిస్థితి విషమం

రాహుల్‌ను రీలాంచ్ చేయాల్సిన అవసరం లేదు.. ఆయనో గొప్ప జననేత: మహేష్ కుమార్ గౌడ్

Big Stories

Advertisement
×