cheapest bikes under rs 70000: దేశీయ మార్కెట్‌లో టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక గ్రామంలో రెండు లేదా మూడు బైక్‌లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ప్రస్తుతం ఇంటికో బైక్ కంపల్సరీ అయిపోయింది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం రోజుకో కొత్త మోడల్ వాహనాన్ని దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేస్తూ బైక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే భారతదేశంలో ఎక్కువ శాతం సామాన్య మధ్యతరగతి ప్రజలే జీవిస్తున్నారు. వారు రోజు వారి పనుల కోసం అధిక మైలేజీని అందించే బైక్‌లనే ఎంచుకుంటున్నారు. అందువల్ల మీరు కూడా అలాంటి బైక్‌ల కోసం ఎదురుచూస్తుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే ఈ బైక్‌లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం.
హోండా షైన్ 100
హూండా షైన్ 100 బైక్‌కు దేశీయ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. సామాన్య ప్రజలకు ఇది ఎంతో నచ్చిన బైక్. ఈ బైక్ 98.98 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 7.38 పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి 68 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ బైక్ కేవలం రూ.65,143 ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
Also Read: యూత్‌ని మైమరపిస్తున్న స్కూటర్.. సరికొత్త కలర్స్‌లో టీవీఎస్ ఎన్‌టార్క్ విడుదల..!
బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100 బైక్ 102 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 7.9 పిఎస్ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్‌లో 4 స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. ఈ బజాజ్ ప్లాటినా 100 బైక్ లీటర్‌కి 70 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ సిల్వర్, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ రూ.68,742 ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది. ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే బైక్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇవే బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.
టీవీఎస్ స్పోర్ట్:
టీవీఎస్ కంపెనీ బైక్‌లకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ బైక్ 109.7 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.19 పిఎస్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి 70 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ రూ.67,320 నుంచి రూ.72,033 ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తున్నాయి.