BigTV English

YS Sharmila: కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్న.. బాబుగారి ఇది మీకు న్యాయమూ?

YS Sharmila: కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్న.. బాబుగారి ఇది మీకు న్యాయమూ?

YS Sharmila: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కాంగ్రెస్ పార్టీ అలర్టయ్యింది. కూటమి నేతలు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ట్రూ అప్ ఛార్జీలపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. ఇది చాలదన్నట్లుగా రూ.12 వేల కోట్ల అధిక భారం మోపాలని చూడటం దుర్మార్గమని ప్రస్తావించారు. ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి? అంటూ విరుచుకు పడ్డారు.

విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని అన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని, చివరకు ప్రజా కోర్టులో పడిందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు.


రూ. 12 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడాలన్నారు. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని ప్రస్తావించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే APERCకి లేఖ రాయాలన్నారు. గతంలో విధించిన రూ.17 వేల కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ALSO READ: ఉదయం వివాహం.. రాత్రికి వధువు సూసైడ్, తెర వెనుక కథేంటి?

విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఏపీలో కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదని కొద్దిరోజుల కిందట చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.

వైసీపీ హయాంలో చేసిన తప్పులను సరి చేసేందుకే సమయం సరిపోతుందన్నారు. గతంలో వైసీపీ హయాంలో యాక్సిస్ ఎనర్జీతో యూనిట్‌కు రూ.5.12లకు ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఒప్పందాన్ని సవరించి యూనిట్ రూ.4.60లకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా ప్రస్తావించడంపై ఛార్జీలు పెరుగుతున్నాయన్న ఆందోళన సామాన్యుడిలో మొదలైంది.

Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×