This Week Theatre and OTT Releases: ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత సినీ ప్రియులు పెద్దగా థియేటర్లకు వెళ్లడం లేదు. ఏదో పెద్ద హీరో సినిమా అయితే తప్ప ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో ఓటీటీలపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఎలాంటి టికెట్, జర్నీ లేకుండా ఇంట్లోనే టీవీ లేదా మొబైల్‌లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు కూడా వారిని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే ప్రతి వారం లాగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు థియేటర్, ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్ చిత్రాలు:
రాజు యాదవ్
ప్రముఖ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌లో తన కామెడీతో ఆడియన్స్‌ను ఎంతగానో ఎంటర్‌ట్రైన్ చేసిన గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా ‘రాజుయాదవ్’ (Raju yadav) సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో అంకిత కారాట్ హీరోయిన్‌గా నటిస్తుంది. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మాతలుగా ఉన్నారు. అయితే ఈ సినిమా మే 17న విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మే 23న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
లవ్ మీ
ఆశిష్, ‘బేబి’ ఫేం వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’ (Love Me). అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 25న విడుదల కానుంది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని మూవీ యూనిట్ చెబుతోంది.
Also Read: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది..!
డర్టీ ఫెలో
ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన కొత్తచిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). ఈ చిత్రాన్ని జి.ఎస్.బాబు నిర్మించారు. శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితిలు నటీ నటులుగా నటిస్తున్నారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.
మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా)
మంచి యాక్షన్ కోసం చూస్తున్నవారికోసం ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంఛైజీలో మరొక కొత్త సినిమా వస్తుంది. ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ (Furiosa: A Mad Max Saga) పేరుతో రిలీజ్ కానున్న ఈ చిత్రం యాక్షన్, అడ్వెంచరస్‌ను ఇష్టపడే వారి కోసం వచ్చేస్తుంది. ఈ మూవీ అన్యటేలర్, క్రిస్ హేమ్స్‌వర్త్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Also Read: Gam Gam Ganesha Trailer: ఆనంద్ కామెడీ అదిరింది గురూ.. గంగం గణేశా ట్రైలర్ రిలీజ్..
ఓటీటీలో చిత్రాలు/ సిరీస్‌లు
డిస్నీ+హాట్‌స్టార్
మే 23 – ది కర్దాషియన్స్ 5 (వెబ్‌సిరీస్)
మే 24 – ద బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ)
జియో సినిమా
మే 21 – ఆక్వామెన్-2 (తెలుగు)
మే 21 – డ్యూన్2 (హాలీవుడ్)
నెట్‌ఫ్లిక్స్
మే 22 – టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంటరీ సిరీస్)
మే 24 – అట్లాస్ (హాలీవుడ్)
మే 24 – క్య్రూ (హిందీ)
Also Read: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ స్టోరీ.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
అమెజాన్ ప్రైమ్
మే 23 – ద టెస్ట్ 3 (వెబ్‌సిరీస్)
జీ 5
మే 24 – వీర్ సావర్కర్ (హిందీ)
యాపిల్ టీవీ ప్లస్
మే 22 – ట్రైయింగ్ 4 (వెబ్‌సిరీస్)
లయన్స్ గేట్ ప్లే
మే 24 – వాంటెడ్ మాన్ (హాలీవుడ్)