BigTV English

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

CIBIL Score: దేశంలో రకరకాల సంస్కరణలు తీసుకొస్తోంది కేంద్రం. తొలిసారి బ్యాంకు లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది ఆర్థికశాఖ. క్రెడిట్ హిస్టరీ లేదని దరఖాస్తులు తిరస్కరించకూడదని తేల్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు, రుణ సంస్థలకు ఆర్‌బీఐ స్పష్టమైన సూచనలు చేసింది.


బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునేవారికి శుభవార్త చెప్పింది కేంద్రప్రభుత్వ. సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని తేల్చింది. తొలిసారి లోన్ అప్లై చేయాలనుకుంటే రెడిట్ స్కోర్ లేకపోయినా పర్వాలేదు. వినియోగదారులు పెట్టుకున్న దరఖాస్తులను బ్యాంకులు తోసిపుచ్చవు.

కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు, వ్యక్తిగత అవసరాల కోసం లోను తీసుకోవాలని ఇక భయపడాల్సిన పనిలేదు. ఒకవిధంగా చెప్పాలంటే శుభవార్తే.  సిబిల్ స్కోర్-CIBIL Score అనేది వ్యక్తిగత క్రెడిట్ హిస్టరీ ఆధారంగా తయారయ్యే స్కోర్. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వ్యక్తులకు లోన్ ఇచ్చేటప్పుడు వారి క్రెడిట్ విలువ అంచనా వేస్తారు.


లోను తీసుకోబోయే కస్టమర్ లోన్ కడతారా ఎగ్గొడుతాడా? అనేది అంచనా వేయడానికి ఉపయోగపడేది సిబిల్ స్కోర్. 300 నుండి 900 మధ్య ఈ స్కోర్ ఉంటుంది. స్కోర్ ఎక్కువ అంటే ఎప్పటికప్పుడు లోను తీసుకుని అనుకున్న సమయంలో చెల్లిస్తున్నారు అనేది చెప్పడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.

ALSO READ: పొదుపుతో బంగారం సొంతం.. మీ కోసమే టాప్ స్కీమ్స్

పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి బ్యాంకులు. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో జరిగిన ఓ సెషన్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేశారు. మొదటిసారిగా లోను తీసుకునేవారు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా పర్వాలేదన్నారు.

వినియోగదారులు పెట్టుకున్న అప్లికేషన్‌ను తిరస్కరించకూడదని ఆర్బీఐ తమ మార్గదర్శకాలలో తెలిపింది. రుణ మంజూరుకు కనీస క్రెడిట్ స్కోర్‌ను ఆర్బీఐ నిర్దేశించలేదన్నది మంత్రి మాట. అయితే బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానాలు బట్టి రుణాలపై నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. రుణ దరఖాస్తుదారుని అర్హతను అంచనా వేయడానికి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-సీఐఆర్ అనేది ఒకటి మాత్రమే.

ఇదే తుది నిర్ణయం కాదన్నారు. సిబిల్ స్కోర్ లేనంత మాత్రాన బ్యాంకులు రుణాలను ఇవ్వరన్నారు. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు తప్పనిసరిగా దరఖాస్తుదారుడి ఆర్థిక సామర్థ్యంపై పరిశీలన చేస్తారని, గతంలో ఏవైనా రుణాలుంటే వాటిని తిరిగి చెల్లించిన తీరు, సెటిల్‌మెంట్లు లేదా రైట్-ఆఫ్‌లు వంటి వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేశారు.

ఒక వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కేవలం వంద రూపాయలను మాత్రమే వసూలు చేయాలి. ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. క్రెడిట్ బ్యూరో కంపెనీలు ప్రతీ ఏటా ఒకసారి వ్యక్తికి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ ఇవ్వాలి. సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల రుణం పొందలేకపోతున్నారు.

ఆర్థిక శాఖ ప్రకటన వల్ల తొలిసారి రుణం తీసుకునేవారికి మంచి అవకాశం. యువత, చిన్న వ్యాపారులు లేదా క్రెడిట్ హిస్టరీ లేనివారు బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచడంతోపాటు ఎక్కువ మందికి రుణ సౌకర్యాలను అందుబాటులోకి వస్తుంది.

Related News

Gold saving schemes: పొదుపుతో బంగారం సొంతం.. మీ కోసమే టాప్ స్కీమ్స్.. డోంట్ మిస్!

Real Estate: కొత్త ఇల్లు కడుతున్నారా…అయితే ఏమేం పర్మిషన్లు కావాలో వెంటనే తెలుసుకోండి..

ATM transaction: ఆర్‌బీఐ కొత్త ఏటీఎం నియమాలు.. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే బాదుడే..

Gold: బంగారు భారతం చరిత్ర.. మొదటి బంగారు నాణెం ఇదేనా.!

Vishal Mega Mart: విశాల్ మార్ట్‌ లో దొంగతనాలు, మరీ.. అండర్ వేర్లు కూడానా?

Big Stories

×