BigTV English

Mahindra XUV 700: మహీంద్రా కార్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడు ఎంతకు కొనేయొచ్చంటే..?

Mahindra XUV 700: మహీంద్రా కార్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడు ఎంతకు కొనేయొచ్చంటే..?

Mahindra XUV 700 AX5: దేశంలో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఫ్యామిలీకి సరిపడా భారీ స్థలంతో ఈ కార్లు రావడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఒకప్పుడు ఇలాంటి కార్లను పెద్దగా ఎవరూ కొనేవారు కాదు. కానీ ఇప్పుడంతా వీటినై మొగ్గుచూపుతున్నారు. అందువల్లనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు సైతం కొత్త కొత్త కార్లను ఫ్యామిలీకి సరిపడా సీట్లతో తీసుకొస్తున్నాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ తరచూ డిఫరెంట్ టైప్‌లలో కార్లను లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది.


ఇందులో భాగంగానే గత మూడేళ్ల క్రితం కంపెనీ Mahindra XUV 700 అనే కారును దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఈ కారు మంచి రెస్పాన్స్ అందుకుంది. చాలా మంది వాహన ప్రియులు ఈ Mahindra XUV 700 కారుని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ కారు అమ్మకాలు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా Mahindra XUV 700 కారుని ఈ సెగ్మెంట్‌లో పోటీ పడటానికి ఇతర కంపెనీల కార్లు లేనందున ఇంకా మంచి డిమాండ్ ఏర్పడింది.

Also Read: దిమ్మతిరిగే డీల్.. నిస్సాన్ కార్లపై రూ.1.64 లక్షల భారీ డిస్కౌంట్.. వారికి మాత్రమే..!


అలా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ కారు సేల్స్ మరింత పెంచేందుకు మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ మోడల్‌లోని కొన్ని వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. గతనెలలో Mahindra XUV 700 టాప్ వేరియంట్ల ధరలను దాదాపు రూ.2.20 లక్షలు తగ్గించింది. అయితే ఇప్పుడు మరికొన్ని వేరియంట్ల ధరలను కూడా భారీ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

తాజాగా Mahindra XUV 700 AX5 డీజిల్ ఆటోమేటిక్ 7సీటర్ వేరియంట్ ధరను రూ.70,000 వరకు తగ్గించింది. దీంతో ఈ వేరియంట్‌ కోసం రూ.20.39 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్న AX5 పెట్రోల్ మాన్యువల్ 7 సీటర్, AX5 డీజిల్ మాన్యువల్ 7 సీటర్లపై రూ.50,000 తగ్గించింది. దీంతో పాటుగా XUV 700 AX 3 డీజిల్ ఆటోమేటిక్ 7-సీటర్, AX 5 డీజిల్ ఆటోమేటిక్ 5 సీటర్లపై రూ .20,000 తగ్గింపు అందిస్తుంది. దీంతో ఈ XUV 700 రూ .13.99 లక్షల నుండి రూ .26.04 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల మధ్య ఉన్నాయి. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 2.2-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు ఉన్నాయి.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×