BigTV English

Citroen C3 New Dhoni Edition: సిట్రోయెన్ నుంచి ధోని స్పెషల్ ఎడిషన్.. ఈ కార్లు కావాలంటే లక్ ఉండాలంతే!

Citroen C3 New Dhoni Edition: సిట్రోయెన్ నుంచి ధోని స్పెషల్ ఎడిషన్.. ఈ కార్లు కావాలంటే లక్ ఉండాలంతే!

Citroen C3 New Dhoni Edition Launch: క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి కార్లంటే మహాఇష్టం. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కంపెనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనిని నియమించింది. గతవారం సంస్థ సిట్రోయెన్ C3, C3 ఎయిర్‌క్రాస్, ప్రత్యేక ధోనీ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కార్లు లిమిటెడ్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఇటీవల సోషల్ మీడియాలో స్పెషల్ ఎడిషన్ C3 ఎయిర్‌క్రాస్‌ మోడల్‌ను విడువల చేసింది.


సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్:
కొత్త ధోనీ ఎడిషన్ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ స్టాండర్డ్ వెర్షన్‌కు వేరుగా ఉంటుంది. వెనుక డోర్‌లపై నంబర్-7 చారల డిజైన్, ఫ్రంట్ డోర్లపై ‘ధోనీ ఎడిషన్’ గ్రాఫిక్స్ దీని అతిపెద్ద ఫీచర్. ధోనికి  నంబర్ 7 లక్కీ నంబర్‌గా ఉంటుంది. ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి. ధోని జెర్సీ నంబర్ కూడా 7.

ధోని ఒక ఇండియన్ క్రికెట్ ప్లేయర్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా తన జెర్సీపై అదే నంబర్‌ ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ C3 ఎయిర్‌క్రాస్ గురించి చెప్పాలంటే దాని ఇంటీరియర్‌లలో కూడా కొన్ని మార్పులు చూడవచ్చు. కొన్ని ప్రదేశాలలో నంబర్ 7ని కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కొన్ని అదనపు ఫీచర్లను కూడా ఉంటాయి.


Also Read: ఇన్నాళ్లకు దొరికింది.. రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే!

ఇది కాకుండా C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు MS ధోని సహకారంతో కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశాన్ని కూడా ఉంది. సోషల్ మీడియాలో సిట్రోయెన్  తాజా టీజర్ C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ గ్లోవ్ బాక్స్‌లో కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా ఉంది.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మాన్యువల్ ఎయిర్ కండీషనర్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల ORVMలతో వస్తుంది. భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్‌వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: మిడిల్ క్లాస్ కార్లు.. బైక్ కంటే ఇవే బెటర్!

C3 ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ధోనీ ఎడిషన్ అదే పవర్‌ట్రైన్‌తో వస్తుంది. ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 109 bhp పవర్ 190 Nm (ATలో 205 Nm) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్  6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.

Tags

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×