BigTV English

YS Sharmila: వైసీపీని కమ్మేస్తున్న కాంగ్రెస్‌.. జగన్ అడ్డుకోగలరా?

YS Sharmila: వైసీపీని కమ్మేస్తున్న కాంగ్రెస్‌.. జగన్ అడ్డుకోగలరా?
YS Sharmila Meets Sonia Gandhi & Rahul Gandhi: హుందా రాజకీయాలు చేసేవాళ్లు, విపక్షాలను పాలసీలపై మాత్రమే విమర్శలు చేసేవారికి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయ భవిష్యత్ కనిపిస్తుంది. దానికి మంచి ఉదాహరణ చంద్రబాబు. ఆయన తన జీవితంలో రాజకీయంగా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కున్నా.. అంతే ఉత్సాహంతో లేచి నిలబడతున్నారు. కానీ, అధికారమే శాశ్వతం అనుకొని పాలన చేసే వారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. దానికి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఉదాహరణగా కనిపిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ చేసి నేతలంగా బీజేపీ, కాంగ్రెస్ లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

కానీ, ఏపీలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా వైసీపీని కాంగ్రెస్ పార్టీ కమ్మేస్తుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. వారి మధ్య ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పెర్పార్మెన్స్ బాగుందనే అభిప్రాయాన్ని అగ్రనేతలు షర్మిల దగ్గర వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో మెజారిటీ ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కు పట్టాయి. సీమలో వైసీపీ ఘోర పరాభవానికి కాంగ్రెస్ కారణమని ఆ పార్టీ అధిష్టానం నమ్ముతోంది. రాష్ట్రవ్యాప్తంగా గతంలో తమకు సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంక్ మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఐదేళ్లు కష్టపడితే.. 2029 నాటికి ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా.. సీట్లు కూడా తెచ్చుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. దీంతో.. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారికి గాలం వేసే పనిలో కాంగ్రెస్ పడింది.


జగన్ నియంతృత్వ పోకడలతో ఉక్కపోతకు గురైనవారు, వైసీపీలోనే ఉంటే భవిష్యత్ శూన్యం అవుతుందని భావించిన వారు కాంగ్రెస్ వైపు చూస్తారని ఓ అంచనా. అలాంటివారిని డైరెక్ట్‌గా సంప్రదించాలని సోనియా, రాహుల్.. షర్మిలకు చెప్పినట్టు తెలుస్తోంది. తలకిందుల తపస్సు చేసినా వైసీపీ ఓటు బ్యాంక్ టీడీపీ, జనసేన, బీజేపీ వైపు సిఫ్ట్ అవ్వదు. ముస్లింలు, ఎస్సీ, ఎస్సీలు ఎక్కువగా కాంగ్రెస్ తోనే ఉంటారు.

కాంగ్రెస్ స్థానంలో వైసీపీ వచ్చింది కాబట్టి.. ఆ పార్టీ వైపు సిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ బలపడితే.. ఆ ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. పైగా వైసీపీలో ఉంటే నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి ఉండదు. అదే కాంగ్రెస్ లో చేరితే స్వాతంత్ర్యం ఎక్కువ. తెలంగాణలోని బీఆర్ఎస్ పరిస్థితే ఏపీలో వైసీపీకి పట్టేలా ఉంది. మరో ఏడాదిలో ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ కు సిష్ట్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: కేసీఆర్ బాటలో జగన్, అసెంబ్లీకి డుమ్మా కొట్టే ఛాన్స్!

దీనికి తోడు.. పక్కనే ఉన్న తెలంగాణ, కర్నాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం ఏపీలో కలిసి వస్తుందనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల వరకూ గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. ఆ తర్వాత వైసీపీ క్యాడర్ కాంగ్రెస్ లోకి వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. ఏపీలో కాంగ్రెస్ బలపడటాన్ని పరోక్షంగా  చంద్రబాబు కూడా స్వాగతిస్తారు. కాంగ్రెస్ బలపడితే ప్రత్యర్థి బలహీనపడినట్టే.. అది టీడీపీకి లాభం చేస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా చంద్రబాబు కాంగ్రెస్ బలపడటాన్నే కోరుకుంటారు. మొత్తానికి జగన్ కు ఇప్పుడు అన్ని సుడిగుండాలే కనిపిస్తున్నాయి.

అయితే.. జగన్ ఈ విషయాన్ని గ్రహించే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఫలితాలు వచ్చి 2 వారాలు అవుతున్నా.. ఇంతవరకూ ఈవీఎంల ట్యాపంరింగ్ పై స్పందించని జగన్ .. సడెన్‌గా ట్వీట్ చేశారు. బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినపుడు ఈ ట్యాంపరింగ్ అంశం గుర్తు రాలేదేమో కానీ.. ఇప్పుడు 11 సీట్లు వచ్చినపుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఇదంతా ట్యాంపరింగ్‌ గురించి కాదని కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈవీఎంల అంశాన్ని తెరపైకి తెస్తుంది. కాంగ్రెస్‌కు లేవనెత్తిన అంశానికి మద్దతు పలికితే ఆ పార్టీ ఏపీలో ఆపరేషన్ ఆకర్శ్ ని నిలిపివేస్తుందని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీని పెంచుకోవడానికే చూస్తారు. జగన్ అంశాల వారీగా తమకు మద్దతిచ్చాడని సొంతపార్టీ బలోపేతం కాకూడదని ఎవరూ అనుకోరు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×