CMR Jewellery Gajuwaka:జువెలరీకి CMR ఎంత ఫేమస్ అనేది స్పెషల్ గా చెప్పక్కర్లేదు,అలాంటి CMR తాజాగా విశాఖపట్నం కస్టమర్స్ కోసం మరో కొత్త షోరూమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గాజువాకలో ప్రారంభమైన ఈ నూతన CMR జువెలరీ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి భాగ్యశ్రీ బోర్సే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సంప్రదాయ ఆభరణాల నుంచి మోడ్రన్ డిజైన్స్ వరకు ఎన్నో వెరైటీ కలెక్షన్స్ ని ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
గాజువాకలో కొత్త జువెలరీ షోరూమ్
వస్త్ర వ్యాపారంలో 40 ఏళ్లకు పైగా, జువెలరీ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న CMR గ్రూప్ ప్రారంభించిన ఈ కొత్త జువెలరీ షోరూమ్ కి గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఇక ఈ షోరూమ్ కి మొదటి కస్టమర్ గా ప్రసన్న వెంకటేశ్వరరావు నిలిచినట్లు సంస్థ పేర్కొంది.
భాగ్యశ్రీ బోర్సే రాకతో మరింత సందడి
ఇక ఈ ఓపెనింగ్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో షోరూమ్ ప్రారంభ కార్యక్రమం సందడి సందడిగా సాగింది,ఇక భాగ్యశ్రీకొత్త షోరూమ్‌లోని ఆభరణాల డిజైన్లను పరిశీలిస్తూ కార్యక్రమంలో సందడి చేశారు. సంప్రదాయంగా కనిపించే బంగారు నగల నుంచి, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ మోడల్స్ వరకు ఎన్నో రకాల ఆభరణాలు అందుబాటులో ఉండటం ఈ షోరూమ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల కోసం నగలు కొనాలనుకునేవారికి అన్ని రకాల ఒకే చోట చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవడానికి ఇలాంటి కలెక్షన్లు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.
CMR చైర్మన్ ఏమన్నారంటే?
ఇక ఈ సందర్భంగా CMR గ్రూప్ చైర్మన్ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ, తమ సంస్థపై వినియోగదారులు ఇన్నేళ్లుగా చూపిస్తున్న నమ్మకమే అభివృద్ధికి ప్రధాన కారణమని తెలిపారు. నాణ్యమైన ఆభరణాలు, మంచి సేవలు అందించడమే తమ లక్ష్యమని ,గాజువాకలో కొత్త షోరూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
బంగారం కొనేవారికి స్పెషల్ ఆఫర్లు
కొత్త షోరూమ్ ప్రారంభం సందర్భంగా CMR జువెలరీ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం విశేషం. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై ఫ్లాట్ 5.99 శాతం వీఏ (తరుగు) ఆఫర్ అందిస్తున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు.ఇక సాధారణ వెండి వస్తువులపై కిలోకు రూ.5,999 తగ్గింపు ప్రకటించడం ఇక్కడ మరో విశేషం.అంతేకాదు, పాత బంగారం ఇచ్చి కొత్త నగలు కొనేవారికి ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ.200 డిస్కౌంట్ తో పాటు, డైమండ్ జువెలరి పై క్యారెట్‌కు 10 శాతం తగ్గింపు ప్రకటించారు కూడా.అయితే, ఈ ఆఫర్లు గాజువాకలోని కొత్త CMR జువెలరీ షోరూమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది
విశాఖ వాసులకు మరో కొత్త ఆప్షన్
ఇక సంప్రదాయ నగలు కావాలన్నా, మోడరన్ డిజైన్లు కావాలన్నా షోరూమ్‌ను సందర్శించి కలెక్షన్లను పరిశీలించవచ్చని తెలిపారు నిర్వాహకులు. మొతానికి గాజువాకలో సరికొత్త CMR షో రూమ్ ఓపెన్ కావడం అంటే బంగారు ప్రియులకి ఇదొక మరో బెస్ట్ ఆప్షన్ గా నిలవడం పక్కా అనడంలో సందేహం లేదు !