Big Stories

Upcoming Compact SUV: ఈ ఏడాది లాంచ్ కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే!

Upcoming Compact SUV’s in India Market: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో బడ్జెట్ ఎస్‌యూవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అనేక కంపెనీలకు చెందిన మోడళ్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మంచి ఫీచర్లు, అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తున్నాయి. అయితే ఈ ఏడాది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లలో నాలుగు కొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఏ కంపెనీ ఎటువంటి మోడల్ లాంచ్ చేయనుంది. ఎటువంటి మార్పులు చేయనుందో ఇప్పుడు చూడండి.

- Advertisement -

మహీంద్రా XUV 3XO
మహీంద్రా XUV 3XOను కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విడుదల చేయనుంది. ఈ ఎస్‌యూవీ 29 ఏప్రిల్ 2024 న భారత మార్కెట్లోకి రానుంది. తాజాగా కంపెనీ దీనికి సంబంధించి మూడు టీజర్లను విడుదల చేసింది. ఇందులో అనేక ఫీచర్ల గురించి సమాచారం అందించారు. మహీంద్రా XUV 3XO ను ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌గా తీసుకువస్తోంది. ప్రస్తుతం కంపెనీ తన ICE వేరియంట్‌ను లాంచ్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత దాని ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది.

- Advertisement -

Also Read: అద్భుతం చేసిన హీరో 125R.. అదిరిపోతున్న రెస్పాన్స్‌

హ్యుందాయ్
హ్యూందాయ్ ఎస్‌యూవీలు దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. భారతీయులకు కూడా మంచి ఎంపికగా ఇవి ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం కాంపాక్ట్ ఎస్‌యూవీ వేరియంట్‌ను ప్రారంభించనుంది. ఇందులో డిజైన్ నుండి ఫీచర్ల వరకు మార్పులు చేయవచ్చు. ఈ SUV ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయవచ్చు.

టాటా నెక్సాన్ CNG
టాటా నెక్సాన్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ప్రస్తుతం కంపెనీ ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందిస్తోంది. అయితే త్వరలో దీని CNG వెర్షన్ కూడా భారత మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ తన CNG వెర్షన్‌ను ఫిబ్రవరి 2024లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ప్రదర్శించింది. సమాచారం ప్రకారం నెక్సాన్ CNG కంపెనీ సెప్టెంబర్ ముందు ప్రవేశపెట్టవచ్చు.

Also Read: టాటా నుంచి కొత్త వెహికల్స్.. ఇదే అతిపెద్ద లాంచ్!

కియా క్లావిస్
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా కూడా ఈ ఏడాది భారత మార్కెట్లోకి కాంపాక్ట్ ఎస్‌యూవీగా క్లావిస్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లాంచ్‌కు ముందు కంపెనీ దీనిని పరీక్షిస్తోంది. ఇది చాలాసార్లు వీధుల్లో కనిపించింది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ సోనెట్, సెల్టోస్ లుక్‌తో తీసుకురావచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్ వంటి అనేక ఫీచర్లు ఇందులో చూడొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News