Sunita Kejriwal Comments on BJP: లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న తన భర్త ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ చంపడానికి ప్రయత్నిస్తుందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్ తినే ప్రతి ఆహారాన్ని పరివేక్షిస్తున్నారని అన్నారు.
తన భర్త కేజ్రీవాల్ 12 ఏళ్లుగా షుగర్ తో బాధ పడుతున్నారని.. దీంతో అప్పటినుంచి ఆయన రోజూ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ తిరస్కరించి బలవంతంగా చంపడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జైలులో కేజ్రీవాల్ తినే ప్రతి ముద్దను కెమెరాలు అమర్చి బీజేపీ పర్యవేక్షిస్తుందన్నారు. ఇలా చేయడం చాలా సిగ్గు చేటని సునీత్రా కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచీలో ప్రతిపక్షాల ఇండియా కూటమి ఏర్పాటు చేసిన మెగా ర్యాలీలో పాల్గొన్న సునీతా కేజ్రీవాల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Uddhav Thackeray: నన్ను రాజకీయంగా ఫినీష్ చేశామన్నారు.. మళ్లీ నా గురించే ఎందుకు చర్చా..?
కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లను దోషులుగా నిరూపించకుండానే వారిని నిందితులుగా చూపిస్తూ.. అన్యాయంగా జైలులో పెట్టారని, ఇది నియంతృత్వ పాలనకు నిదర్శణమని విమర్శించారు. తన భర్త కేజ్రీవాల్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలకు మంచి వైద్యం, విద్యను అందించడమే కేజ్రీవాల్ చేసిన తప్పా అంటూ బీజేపీని ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలక కోసం కేజ్రీవాల్ తన జీవితాన్ని పణంగా పెట్టారని సునీతా మెగా ర్యాలీలో వెల్లడించారు. కేజ్రీవాల్ ఐఐటీ గ్రాడ్యుయేట్ అని, కావాలనుకుంటే విదేశాలకు వెళ్లవచ్చని.. కానీ, వాటన్నింటినీ కాదని దేశభక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి.. తన జీవితాన్ని ప్రజలకు సేవ చేయడానికి అంకింత చేశారని పేర్కొన్నారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి అస్వస్థత.. ఇండియా మెగా ర్యాలీకి దూరం
అయితే రాంచీలో జరుగుతున్న ఈ ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థత కారణంగా పాల్గొనలేకపోయారు. రాహుల్ గాంధీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. దీంతో పాటుగా ఇండియా కూటమికి చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు.