BigTV English

Upcoming Compact Suvs: ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయి.. సింగిల్ ఛార్జింగ్‌పై పరుగులే పరుగులు..!

Upcoming Compact Suvs: ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయి.. సింగిల్ ఛార్జింగ్‌పై పరుగులే పరుగులు..!
Advertisement

Upcoming Compact Suvs: ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరగడంతో కాంపాక్ట్ ఎస్యూవీలపైనే ఎక్కువమంది ఫోకస్ పెడుతున్నారు. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లో తీసుకొస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. సింగిల్ ఛార్జింగ్‌పై అధిక మైలేజీని అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా సేఫ్టీ విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా అధునాతన ఫీచర్లను అందిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో నెక్సాన్, బ్రెజ్జా వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా కంపెనీలు తమ కంపాక్ట్ ఎస్యూవీలను రిలీజ్ చేస్తూ వాహన ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరికొన్ని కార్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో హ్యుందాయ్ ఇన్‌స్టర్, కియా క్లావిస్, స్కోడా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ వంటివి ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


హ్యుందాయ్ ఇన్‌స్టర్

దేశీయ ఆటో మొబైల్ రంగంలో హ్యుందాయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇది వరకే రిలీజ్ అయిన ఎస్యూవీలు మంచి ప్రజాదరణ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అదే హ్యుందాయ్ కొత్త ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు. కంపెనీ ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ కారును 2026లో భారతదేశ మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్టిక్ కారు అద్భుతమైన డిజైన్, అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 10.25 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లేలు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్ పోర్టులు వంటి ఉన్నాయి.


ఇది డిజిటల్ కీ 2 టచ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంది. అలాగే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి రానుంది. అందులో ఒకటి 95 హార్స్ పవర్ అందించే 42 కిలోవాట్ బ్యాటరీ, ఇంకొకటి 113 హార్స్ పవర్ అందించే 49 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ వంటివి ఉన్నాయి. కాగా ఇది సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 355 కి.మీ మైలేజీ అందిస్తుంది. త్వరలో ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

Also Read: అదనపు ఫీచర్లు, డిజైన్‌తో కొత్త మారుతి సుజుకి డిజైర్.. లాంచ్ ఎప్పుడంటే..?

కియా క్లావిస్

కియా కార్లకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని కారణంగానే కంపెనీ ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న క్లావిస్ ఎస్యూవీని లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఈ ఏడాది చివరినాటికి అధికారికంగా లాంచ్ చేయబడుతుందని తెలుస్తోంది. కాగా ఇది కేవలం ఇంటర్నల్ కంభూషణ్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం రెండు వేరియంట్లలో వస్తుంది.

అందులో మొదటి వేరియంట్ 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 118 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 6 స్పీడ్ ఐఎంటీ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక సెకండ్ వేరియంట్ విషయానికొస్తే.. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వచ్చే అవకాశం ఉంది.

స్కోడా న్యూ కాంపాక్ట్ ఎస్యూవీ

స్కోడా కంపెనీ కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. న్యూ కంపాక్ట్ ఎస్యూవీని త్వరలో లాంచ్ చేయనుంది. ఈ కారు నెక్సాన్, బ్రెజ్జా కార్లకు పోటీగా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్, 172 ఎన్‌ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

Related News

JioMart Bumper Offer: జియో మార్ట్ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్‌లు రూ.6,399 నుంచే

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. తాజా రేట్లు ఇలా

Airtel Xstream Fiber: బఫరింగ్‌కు గుడ్‌బై.. ఎయిర్‌టెల్ అల్ట్రా వై-ఫై‌తో సూపర్ స్పీడ్.. ధర ఎంతంటే?

Jio Bumper Offer: ఒక్క రీచార్జ్‌తో మూడు నెలల ఎంటర్‌టైన్‌మెంట్.. జియో సర్‌ప్రైజ్ ఆఫర్

Warrant on Amazon: అమెజాన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. కర్నూలు కంజ్యుమర్ ఫోరం తీర్పు!

BSNL Samman Plan: ఒకసారి రీఛార్జ్ చేసుకుని ఏడాదంతా వాడుకోవచ్చు.. రోజూ 2 జీబీ డేటా కూడా, ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!

JioUtsav Offer: జియో ఉత్సవం బంపర్ ఆఫర్.. షాపింగ్ చేసి కూపన్ వాడితే భారీ తగ్గింపు

Gold Price: బంగారం ధర భారీగా పతనం, ఒకే రోజు రూ. 7 వేలు తగ్గుదల, అదే బాటలో వెండి కూడా!

Big Stories

×