BigTV English

IAS Wife suicide: గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిన ఐఏఎస్ వైఫ్, ఇంటికి వచ్చి సూసైడ్

IAS Wife suicide: గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిన ఐఏఎస్ వైఫ్, ఇంటికి వచ్చి సూసైడ్

IAS Wife suicide: కారణం ఏంటో తెలీదుగానీ.. ఆ ఐఏఎస్ భార్య ట్రాక్ తప్పింది. గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది. విషయం తెలిసిన తర్వాత అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు భర్తను వదిలి ఇంటి నుంచి పారిపోయింది. రేపో మాపో ఆమెకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఆ ఐఏఎస్. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.


గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రణజీత్ కుమార్, ప్రస్తుతం ఆ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ 45 ఏళ్ల ఆయన భార్య సూర్యజై‌కు తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఆమె ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది జరిగి దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది. సీన్ కట్ చేస్తే.. వీరిద్దరూ కలిసి జూలై 11న తమిళనాడులోని ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. అయితే మదురై పోలీసులు అలర్ట్ కావడంతో బాలుడ్ని ఈ గ్యాంగ్ నుంచి కాపాడారు. అప్పటినుంచి ఈ గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.


ALSO READ: చిక్కుల్లో ఐఏఎస్ స్మిత సబర్వాల్, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

మళ్లీ ఏమైందో తెలీదు.. శనివారం గాంధీనగర్‌లో ఉంటున్న తన భర్త రణజీత్ కుమార్ ఇంటికి సూర్య జై వచ్చింది. కానీ ఆమెని ఇంట్లోకి రానివ్వలేదు ఆ ఐఏఎస్. దీంతో విషం తాగి సూర్య జై సూసైడ్ చేసుకుంది.
ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ వ్యవహారంపై రణజీత్ తరపు అడ్వకేట్ రియాక్ట్ అయ్యారు.

ఏడాదిగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని, విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. విడాకుల వ్యవహారం మీద రణజీత్ బయటకు వెళ్లిన సమయంలో సూర్య ఇంట్లోకి వచ్చి సూసైడ్ చేసుందన్నారు. సూర్యజై పై తమిళనాడులో కొన్ని కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం తమిళనాడు హైకోర్టులో ఆమె పిటీషన్ దాఖలు చేశారు. ఇంతలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టారామె.

Related News

Husband And Wife Incident: అర్ధరాత్రి గొడవ.. భార్యను గొంతు నులిమి చంపేసిన భర్త..

Vasudha Pharma: విషాదం.. విశాఖ ఫార్మా కంపెనీ డైరక్టర్ ఆత్మహత్య..

Varshini Case: కన్నతల్లే హంతకురాలు.. వర్షిణి హత్య కేసులో సంచలన ట్విస్ట్!

Medchal News: గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆటో చెరువులో పడి తండ్రికొడుకులు మృతి

Eluru Nimajjanam: వినాయక నిమజ్జనంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. పగిలిన తలలు

Bus Road Incident: కంటైనర్‌‌ను ఢీ కొన్న ట్రావెల్స్‌ బస్సు.. స్పాట్‌లో నలుగురు మృతి!

Big Stories

×