BigTV English

New Maruti Suzuki Dzire: అదనపు ఫీచర్లు, డిజైన్‌తో కొత్త మారుతి సుజుకి డిజైర్.. లాంచ్ ఎప్పుడంటే..?

New Maruti Suzuki Dzire: అదనపు ఫీచర్లు, డిజైన్‌తో కొత్త మారుతి సుజుకి డిజైర్.. లాంచ్ ఎప్పుడంటే..?

New Maruti Suzuki Dzire Launch Date: ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఆటో మొబైల్ రంగంలో దేశీయ మార్కెట్‌లో అదరగొడుతోంది. కొత్త కార్లను లాంచ్ చేస్తూ సేల్స్‌లో దూసుకుపోతుంది. ఎన్నో ఎళ్ల నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇప్పటికే చాలా రకాల మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసిన మారుతి సుజుకి ఇప్పుడు మరొక మోడల్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ‘మారుతి సుజుకి డిజైర్’ ఆగస్టు 2024లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.


నాల్గవ తరం స్విఫ్ట్ ఆధారంగా.. ఈ లెటెస్ట్ జెన్ డిజైర్ మరిన్ని ఫీచర్లు, డిజైన్‌తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు లీక్ అయిన ఫొటోల ప్రకారం.. రాబోయే కొత్త డిజైర్ ప్రస్తుత వేరియంట్‌తో పోల్చితే కొంచెం ఎక్కువ ఫీచర్లు, పెద్దదిగా కనిపిస్తుంది. కొత్త మారుతి సుజుకి డిజైర్ మోడల్ ఇంటీరియర్ మరింత విశాలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే కొన్ని మార్పులు ఉన్నప్పటికీ.. రాబోయే మారుతి సుజుకి డిజైర్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాల్గవ తరం మారుతి సుజుకి స్విఫ్ట్‌లో ఉన్న ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త డిజైర్‌కు సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..

కొత్త మారుతి సుజుకి డిజైర్ ఇంజన్ వచ్చే నెల ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి స్విఫ్ట్ వలె అదే 1.2-లీటర్, 3-సిలిండర్, Z-సిరీస్ ఇంజన్‌ను పొందుతుంది. ఇక పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇది 80.46bhp పవర్, 111.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT యూనిట్‌తో వస్తుంది. కొత్త మారుతి సుజుకి డిజైర్ ఊహించిన ఫీచర్లు ప్రకారం.. రాబోయే డిజైర్ సెడాన్‌లో సెగ్మెంట్-ఫస్ట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి అదనపు ఫీచర్లను మారుతి సుజుకి కలిగి ఉంటుందని భావిస్తున్నారు.


Also Read: మారుతి ఆల్టో కె10.. రూ.లక్షకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?

ఇక ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ ఊహించిన డిజైన్ విషయానికొస్తే.. కొత్త డిజైర్ ఇంటీరియర్ డిజైన్ దాదాపు నాల్గవ తరం స్విఫ్ట్ మాదిరిగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కలర్, డెకర్‌లో కొన్ని మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. నాల్గవ తరం స్విఫ్ట్‌తో పోలిస్తే రాబోయే డిజైర్‌లో చాలా డిజైన్ అప్‌డేట్‌లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త డిజైర్‌లో కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, గ్రిల్ కనిపించవచ్చని అంచనా.

దీని ఆశించిన మైలేజ్ విషయానికొస్తే.. రాబోయే కొత్త మారుతి సుజుకి డిజైర్ కొత్త స్విఫ్ట్ కంటే కొంచెం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత స్విఫ్ట్ అధికారిక మైలేజ్ లీటర్‌కు 25.72 కిమీ అందిస్తుంది. కొత్త డిజైర్ కూడా అదే మాదిరి మైలేజీ అందిస్తుందని తెలుస్తోంది. అదనంగా కొత్త స్విఫ్ట్, డిజైర్ CNG వెర్షన్ కూడా కొన్ని నెలల్లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×