Google Stolen Phone| ఫోన్ల దొంగతనాన్ని నిరోధించేందుకు గూగుల్ కొత్త ఫీచర్ లాంచ్ చేయబోతోంది. ఫోన్ చోరీ అయినప్పుడు దానిని పూర్తిగా నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 16తో పరిచయం చేయనుంది. ఈ తాజా అప్‌డేట్‌లో భద్రతకు సంబంధించిన ఫీచర్లు మరింత బలోపేతం కానున్నాయి. ఆండ్రాయిడ్ పరికరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే ‘ఆండ్రాయిడ్ పోలీస్’ అనే వెబ్‌సైట్ ప్రకారం.. యజమాని అనుమతి లేకుండా రీసెట్ చేయబడిన ఫోన్‌లు ఇకపై పనిచేయకుండా మారిపోతాయి.
గూగుల్ ఇటీవల ‘ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రదర్శించింది. ఇది ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (FRP) అనే ఫీచర్‌ను మరింతగా శక్తివంతం చేస్తుంది. ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఫోన్ చోరీలకు అడ్డుకట్ట వేసే విధంగా రూపొందించబడింది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 15లో ఎఫ్ఆర్‌పి కు కొన్ని అడ్వాన్స్ మార్పులు చేసింది. ఇక రాబోయే ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లో ఈ భద్రతా వ్యవస్థను మరింతగా పటిష్టంగా మార్చనున్నారు.
ఇంకా గూగుల్ అధికారికంగా ఈ ఫీచర్‌పై ఎటువంటి ప్రకటన ఇవ్వకపోయినా, ఆండ్రాయిడ్ పోలీస్ ఒక స్క్రీన్‌షాట్‌ను పబ్లిష్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్‌లో ఫోన్ స్క్రీన్‌పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ మెసేజ్ కనిపిస్తోంది. దీని ద్వారా తెలిసేది ఏమంటే, ఫోన్‌ను దొంగిలించినవారు దానిని సెట్ అప్ చేసే ప్రక్రియను పూర్తి చేయకపోతే, ఫోన్‌ను రీసెట్ చేయలేరు. ఇంకా రీసెట్ చేసిన తర్వాత కూడా మునుపటి లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్ లేదా గూగుల్ ఖాతా వివరాలను నమోదు చేయకుండా ఫోన్ వాడలేరు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. జూన్ నెలలోనే ఆండ్రాయిల్ 16 లాంచ్ కానుంది. కానీ ఈ కొత్త భద్రతా ఫీచర్‌ను గూగుల్ ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 16 లో ఇతర ఫీచర్లు
టెక్ ఎక్స్‌పర్ట్ సినెట్ (CNET) వెబ్ సైట్ ప్రకారం.. ఆండ్రాయిడ్ 16 లోని మెటీరియల్ 3 డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ లో డైనమిక్ కలర్స్, స్ప్రింగి అనిమేషన్స్ తో పాటు గూగుల్ టెక్నాలజీ ఉన్న స్మోర్ట్ ఫోన్లలో యూజర్లకు మరింత స్మూత్ ఫ్లూయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఆండ్రాయిడ్ 16లో కొత్త ఫీచర్లతో పాటు కొత్త సెట్టింగులు మరింత కస్టమైజేషన్లు రానున్నాయి. ఈ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ లో స్మార్ట్ వాచీలు, స్మార్ట్ టీవీలు లాంటి అన్ని డివైస్ లో జెమిని ఏఐ బిల్ట్ ఇన్ గా ఉంటుంది.
Also Read: ఆండ్రాయిడ్ 16.. ఫీచర్లు, డిజైన్ ఇక అన్నీ ఛేంజ్.. యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్
గూగుల్ ఆండ్రాయిడ్ లో ప్రస్తుతం ఉన్న యాంటి థెఫ్ట్ ఫీచర్లు
థెఫ్ట్ డిటెక్షన్ లాక్: ఈ లాక్ ఏఐ టెక్నాలజీ ద్వాకా పనిచేస్తుంది. డివైజ్ లోని మోషన్ సెన్సర్లు, వైఫై, బ్లూ టూత్, ఇవన్నీ డివైజ్ సడెన్ మూమెంట్ ని గమనిస్తూ ఉంటాయి. ఎవరైనా దొంగ మొబైల్ ఫోన్ లాగేసుకొని పారిపోతే.. ఈ థెఫ్ట్ డిటెక్షన్ లాక్ దాన్ని పసిగట్టి.. ఫోన్ స్క్రీన్ ని ఆటోమెటికల్లి లాక్ చేసి అందులోని కంటెంట్ ని రక్షిస్తుంది.
రిమోట్ లాక్: మీ ఫోన్ కనబడకుండా పోయినా.. లేదా దొంగతనం జరిగినా అందులో రిమోట్ లాక్ అయిపోయే విధంగా సెట్టింగ్ ఉంది. దాన్ని ఒక వెరిఫైడ్ ఫోన్ నెంబర్ తోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ రిమోట్ లాక్ ఉపయోగించాలంటే అందులోని స్క్రీన్ లాక్, ఒక యాక్టివ్ సిమ్ కార్డ్ డివైజ్ లో ఉండాలి. అందులో ఫైండ్ మై డివైజ్ ని ఆన్ చేయాలి. ఆ తరువాత ఆ డివైజ్ ని ఆన్ లైన్ లో ట్రాక్ చేయవచ్చు.