E-Paper
Advertisement

ఈ రైతు ‘లాటరీ’ పండిందోచ్.. రూ.500 టికెట్‌పై ఏకంగా రూ.12 కోట్ల జాక్ పాట్.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర!

ఈ రైతు ‘లాటరీ’ పండిందోచ్.. రూ.500 టికెట్‌పై ఏకంగా రూ.12 కోట్ల జాక్ పాట్.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర!
Advertisement

Lottery Winner: అదృష్టం ఎప్పుడు, ఏ విధంగా తలుపు తడుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ క్రమంలోనే ఓ సామాన్య రైతు విషయంలో అద్భుతం జరిగింది. 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా కొంటూ వస్తున్న లాటరీ టికెట్ రూపంలో అతడికి అదృష్టం వరించింది. పంజాబ్ రాష్ట్రం డేరాబస్సీ సమీపంలోని హుమాయున్‌పూర్ గ్రామానికి (Humayunpur village) చెందిన 45 ఏళ్ల రైతు బల్జీందర్ సింగ్ (Baljinder Singh)కు ఏకంగా రూ.12 కోట్ల లాటరీ తగిలింది. ‘పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీ 2026’ (Diwali Bumper Lottery – 2026) లో ఆయనకు మొదటి బహుమతి దక్కింది.

రూ. 500 టికెట్‌తో జాక్ పాట్

వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న బల్జీందర్ సింగ్.. దీపావళికి ముందు హండేస్రాలోని ఒక లాటరీ విక్రేత వద్ద రూ. 500 పెట్టి ఈ టికెట్ కొనుగోలు చేశారు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో తనకు ఈ భారీ బహుమతి తగిలినట్లు ఆయనకు తెలిసింది. 2010 నుంచి ఆయన లాటరీ టికెట్లు కొంటున్నప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ పెద్ద బహుమతి ఏదీ రాలేదు. ఈ అనూహ్య విజయంతో బల్జీందర్ సింగ్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

‘దేవుడు నా మెుర ఆలకించాడు’

ఇద్దరు పిల్లల తండ్రి అయిన బల్జీందర్ సింగ్.. రూ. 12 కోట్ల జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎట్టకేలకు దేవుడు తన మెుర (ప్రార్థనలు) ఆలకించాడంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన ఈ ప్రైజ్ మనీని ఏ విధంగా ఖర్చు చేయాలి? దేనికి ఉపయోగించాలి? అనే దానిపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. మరోవైపు లాటరీ డబ్బు తీసుకునేందుకు చేయాల్సిన పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు బల్జీందర్ సింగ్ తన స్నేహితులతో కలిసి జిరాక్‌పూర్‌కు బయలుదేరారు.

Advertisement

Also Read: మసీదులో నక్కినా తప్పని చావు.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఖతం.. ఇది కదా రివేంజ్ అంటే!

12 రాశుల పేర్లతో 36 లక్షల టికెట్లు

ఇదిలా ఉంటే దీపావళి బంపర్ లాటరీ డ్రా కోసం అధికారులు మొత్తం 36 లక్షల టికెట్లను ముద్రించారు. వీటిని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే 12 రాశుల పేర్లతో కూడిన సిరీస్‌లలో జారీ చేశారు. దీనికి సంబంధించి మెుదటి బహుమతిని రూ.12 కోట్లు, రెండో బహుమతి రూ.1 కోటి, మూడో ప్రైజ్ మనీని రూ.50 లక్షలుగా ప్రకటించారు. కాగా, ఏళ్ల తరబడి ఓపికతో ఎదురుచూసిన బల్జీందర్ సింగ్ జీవితాన్ని ఆయన కొన్న ఒక రూ. 500 టికెట్ పూర్తిగా మార్చేయడం విశేషం. దీంతో ఆయన కుటుంబంతో పాటు గ్రామంలోనూ పండుగవ వాతావరణం నెలకొంది.

Also Read: రూ.10 కూల్‌డ్రింక్‌తో రూ.800 కోట్ల వ్యాపారం.. పాకిస్తాన్ పేరుబెట్టి ఇండియాలో సంచలనం

Tags

Related News

మసీదులో నక్కినా తప్పని చావు.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఖతం.. ఇది కదా రివేంజ్ అంటే!

ఒక మహిళ వీలునామా రాయకుండానే చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది? చట్టం ఏం చెబుతోందంటే

CNG ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కలకలం.. తెల్లని పొగ మాదిరిగా ఆ ప్రాంతమంతా, భయంతో స్థానికులు పరుగులు

రహస్యంగా రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలు సాక్ష్యంగా చెల్లుతాయా? విడాకుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇదే

మధురై తనిష్క్ దోపిడీ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు అరెస్ట్, 11.7 కిలోల బంగారం రికవరీ

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 100 మీటర్ల లోయలో పడ్డ బస్సు, 8 మంది మృతి

ఎస్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. ఈసీఐకి 48 ప్రశ్నలు!

Big Stories

Advertisement
×