E-Paper
Advertisement

ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు.. వెలుగులోకి తెచ్చిన అమెరికా మీడియా, ఆ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి

ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు.. వెలుగులోకి తెచ్చిన అమెరికా మీడియా, ఆ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి
Advertisement

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బండారం బట్టబయలు అవుతోంది. ఆయనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్విడియా కంపెనీలోకి మాజీ సీఈవో జెన్సన్‌ హువాంగ్‌‌ను మళ్లీ రప్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటల్లో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ కంపెనీలో ట్రంప్ పెట్టుబడులు పెట్టినట్టు అమెరికా మీడియా కోడై కూస్తోంది.

ఎన్విడియాలో ట్రంప్ పెట్టుబడులు

ప్రపంచవ్యాప్తంగా ఆ మధ్య వార్తల్లోకి ఎక్కిన టెక్ కంపెనీ ఎన్విడియా. ఇన్వెస్టర్లకు సిరులు కురిపించింది ఆ కంపెనీ. చిప్‌ తయారీ దిగ్గజ సంస్థలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా మీడియా కోడై కూస్తోంది. వాషింగ్టన్‌ పోస్టు వివరాల మేరకు.. రెండేళ్లలో ట్రంప్‌ పెట్టుబడులు భారీగా పెరిగాయని రాసుకొచ్చింది.

Advertisement

రెండేళ్ల కిందట అంటే 2024లో ట్రంప్‌కు 6,15,000 నుంచి 13 లక్షల డాలర్ల విలువైన షేర్లు ఆ కంపెనీలో ఉండేవి. ఆయన వాటాల విలువ 13 మిలియన్‌ డాలర్ల నుంచి 62 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని ఓ అంచనా. షేర్ల కంటే ఈ సంఖ్య గణనీయంగా ఎక్కువ. 2025 చివరి నుండి ఆగస్టు వరకు ఎన్విడియా షేర్ ధర పెరగడంతో వాస్తవ విలువ పరిధి బహుశా ఎక్కువగా ఉండి ఉండవచ్చని పేర్కొంది.

వెలుగులోకి తెచ్చిన అమెరికా మీడియా

తన స్టాక్‌లను విక్రయించాలన్న పిలుపును అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఆయన పోర్ట్‌ఫోలియోను రెండు విధాలుగా నిర్వహిస్తున్నట్లు వైట్ హౌస్ వివరించింది. అధ్యక్షుడి ఆస్తులు, ఆయన పిల్లలు నిర్వహించే ఒక ట్రస్ట్‌లో ఉన్నాయని పేర్కొంది. థర్డ్ పార్టీ ఆర్థిక సంస్థలు స్వతంత్రంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తాయని, పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాయని వైట్ హౌస్ ప్రతినిధి గతంలో తెలిపారు.

Advertisement

ALSO READ: అతి పెద్ద సైబర్ దాడి.. ప్రపంచవ్యాప్తంగా 178 వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా

Related News

అతి పెద్ద సైబర్ దాడి.. ప్రపంచవ్యాప్తంగా 178 వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా

సామాన్యుడి జేబుకు చిల్లు.. కిరాణా సరుకులే కాదు ఈ రోజువారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి

కొరడా ఝులిపించిన ఆర్బీఐ.. 49 ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల లైసెన్స్ రద్దు, ఏం జరిగింది?

రూ.5 లక్షలు ఉంటే చాలు.. ఈ వినూత్న వ్యాపారాలకు మీరే బాస్.. పోటీ తక్కువ, రాబడి ఎక్కువ!

రాజీనామా చేద్దామనుకున్న ఉద్యోగి.. 15 నెలల జీతం ఇచ్చి స్వయంగా తొలగించిన కంపెనీ

NPS Vs EPF.. 25 ఏళ్లలో ఏ రిటైర్మెంట్ పథకంతో ఎక్కువ రాబడి లభిస్తుంది?

పోస్టాఫీసు మైండ్ బ్లోయింగ్ స్కీమ్.. రూ.లక్ష పెడితే ఏకంగా రూ. 44,995 వడ్డీ.. ప్రభుత్వానిదే బాధ్యత!

Big Stories

Advertisement
×