BigTV English

Hardik Pandya: SRH కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…? లక్ష్మణ్ చేసిన ఆ ఒక్క తప్పిదంతో

Hardik Pandya: SRH కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా…? లక్ష్మణ్ చేసిన ఆ ఒక్క తప్పిదంతో

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2025 సీజన్ కామెంట్రీ ప్యానల్ నుండి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ని బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అనే ఫిర్యాదు నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ పై బీసీసీఐఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తక్కువ చేసేలా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతోనే ఇర్ఫాన్ పటాన్ ని కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.


Also Read: Watch Video: ఆ గుండె బతకాలి రా.. రనౌట్ కు ఛాన్స్ ఉన్న కొట్టలేదు… వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే

కానీ తాజాగా ఈ వ్యవహారంపై ఇర్ఫాన్ పటాన్ స్పందించాడు. తన తొలగింపుకు గల కారణాలను వివరిస్తూ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఐపీఎల్ 2025 కామెంట్రీ నుండి తొలగించడానికి ఒక ప్లేయర్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని అన్నాడు ఇర్ఫాన్ పఠాన్. అయితే అది రోహిత్ శర్మ లేక విరాట్ కోహ్లీ పై చేసిన వ్యాఖ్యలు కాదని.. మరో ఆటగాడిని తాను విమర్శించడంతోనే ఐపీఎల్ కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగించారని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా గత సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ.. ఇర్ఫాన్ పఠాన్ అతడి కెప్టెన్సీ, బౌలింగ్ దక్షతను విమర్శించాడు.


ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ” ఐపీఎల్ లో 14 మ్యాచ్ లలో ఏడుసార్లు తప్పులు గుర్తించినా.. నేను మాత్రం అతడిని అంత తీవ్రంగా విమర్శించలేదు. అది నా వృత్తిలో భాగం. హార్దిక్ పాండ్యా పై నేను చేసిన వ్యాఖ్యలు కొంత ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనివల్ల నా తొలగింపుకు దారితీసింది. కానీ బరోడా క్రికెట్ సర్కిల్ లో హార్దిక్ పాండ్యాతో నాకు ఎటువంటి వైరం లేదు. పాండ్యా సహా అనేక ఆటగాళ్లకు నేను మద్దతు ఇచ్చాను. కెరీర్ ప్రారంభంలో హార్దిక్ పాండ్యాకి చాలా అండగా నిలిచాను. 2012లో హార్దిక్ పాండ్యా గురించి సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ గా ఉన్న వి.వి.ఎస్ లక్ష్మణ్ కి చెప్పాను.

Also Read: Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం

కానీ లక్ష్మణ్ నా మాట పట్టించుకోలేదు. దీంతో 2012లో హార్దిక్ పాండ్యా అన్ సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు. అప్పుడు నేను చెప్పిన మాట లక్ష్మణ్ విని ఉంటే హార్దిక్ పాండ్యా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ {SRH} కి ఆడేవాడు. అలాగే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడు నేను అతడికి అండగా నిలిచాను. ముంబై ఫ్యాన్స్ నుంచి వచ్చిన విమర్శలను తిప్పి కొట్టాను. ఇక ఆటగాళ్లను కామెంటేటర్లు విమర్శించడం పెద్ద తప్పేమీ కాదు. ప్రతి ఆటగాడు విమర్శలు ఎదుర్కొన్న వాళ్లే. కానీ కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యా పై విమర్శలు సరైనవి కావు” అని చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్.

Related News

IND W Squad for World Cup 2025 : వరల్డ్ కప్ కోసం టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ప్లేయర్ల లిస్టు ఇదే

India Asia Cup 2025 Squad: ఆసియా కప్ 2025 ఆడే టీమిండియా జట్టు ఇదే..శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే !

Babar – Rohith : రోహిత్ శర్మ పరువు కాపాడిన పాకిస్తాన్… బాబర్ ను జట్టులోంచి తీసేసి !

Hardik Ex Wife Natasha : నటాషాకు అంత బలుపా.. సెల్ఫీ అడిగితే అలా తోసేసింది ఏంటి

Billy Bowden : అంపైర్ బిల్లీ బౌడెన్ వేళ్లు ఎప్పుడు ఎందుకు అలా వంకరగా ఉంటాయి.. అంత ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడా?

Big Stories

×