CNG Car Market: భారతదేశంలో CNG కార్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. అందుకు అనేక కారణాలు లేకపోలేదు. వీటిలో ముఖ్యంగా ధర, తక్కువ కాలుష్యం, బెటర్ మైలేజీ. దేశంలో ప్రస్తుతం జనాదరణ పొందిన CNG కార్లలో టాటా పంచ్ CNG, మారుతి వ్యాగన్ఆర్ CNG, బాలెనో CNG, బ్రెజ్జా CNG, హ్యుందాయ్ ఎక్సెటర్ CNG, మారుతి ఫ్రంట్ CNG, డిజైర్ CNG, వివిధ విభాగాలకు చెందిన ఇతర వాహనాలు ఉన్నాయి. భారతదేశంలో CNG కార్లకు ప్రజాదరణ పెరగడానికి ఐదు ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Low fuel cost
CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) పెట్రోల్, డీజిల్ కంటే చాలా చౌకగా లభిస్తుంది. CNG కార్లు నడపడానికి కిలోమీటరుకు రూ. 2 కంటే తక్కువ ఖర్చవుతుంది. ఇవి చాలా డబ్బును పొదుపు చేస్తాయి. నేడు రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు CNG మార్కెట్‌కు వరంగా మారింది.
Also Read: రెనాల్ట్ కార్‌పై భారీగా ఆఫర్లు.. రూ. వేలల్లో డిస్కౌంట్లు!
Less pollution
CNG పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. పర్యావరణంపై ప్రేమ ఉన్న కొనుగోలుదారులకు ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది. CNG కార్లు తక్కువ CO2ను విడుదల చేస్తాయి. NOx, PM వంటి హానికరమైన వాయు కాలుష్య కారకాల ఉద్గారాలను కూడా తగ్గిస్తాయి.
Better mileage
CNG వాహనాలు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ఒక్కసారి సీఎన్‌జీ ట్యాంక్ ఫిల్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.ఇంధన ఖర్చులను మరింత తగ్గించవచ్చు.
Government incentives
CNG కార్లను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వం సిఎన్‌జి కిట్‌లపై సబ్సిడీ ఇస్తోంది. సిఎన్‌జి స్టేషన్ల సంఖ్యను పెంచుతోంది. ఇది CNG కార్లను కొనుగోలు చేయడం, నడపడం, మరింత పొదుపుగా సౌకర్యవంతంగా ఉంటుంది.
Also Read: బ్రెజ్జా నుంచి కొత్త ఎడిషన్.. మార్పులు చూస్తే మతిపోతుంది!
Low maintenance
CNG కార్లు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే తక్కువగా కదిలే స్పేర్ పార్ట్స్ కలిగి ఉంటాయి. వాటి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. CNG ఇంజన్లు కూడా పెట్రోల్ డీజిల్ ఇంజిన్‌ల కంటే ఎక్కువ క్వాలిటీగా ఉంటాయి. వాటి రిపేర్, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.