BigTV English

Renault Triber Discount: రెనాల్ట్ కార్‌పై భారీగా ఆఫర్లు.. రూ. వేలల్లో డిస్కౌంట్లు!

Renault Triber Discount: రెనాల్ట్ కార్‌పై భారీగా ఆఫర్లు.. రూ. వేలల్లో డిస్కౌంట్లు!

Renault Triber Discount: గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ ఆటో కస్టమర్లలో 7-సీటర్ కార్లకు డిమాండ్ పెరిగింది. మారుతీ సుజుకి ఎర్టిగా ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మీరు కూడా కొత్త 7-సీటర్ కారు కొనాలని చూస్తున్నట్లయితే మీకో శుభవార్త ఉంది. కంపెనీ 2024 జూలై నెలలో మారుతి సుజుకి ఎర్టిగాతో పోటీపడే దేశంలోని అత్యంత చౌకైన 7-సీటర్ రెనాల్ట్ ట్రైబర్‌పై బంపర్ తగ్గింపును అందిస్తోంది.


జూలై నెలలో రెనాల్ట్ ట్రైబర్‌ని కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు రూ. 40,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి. అయితే కస్లమర్లు డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోస సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: బ్రెజ్జా నుంచి కొత్త ఎడిషన్.. మార్పులు చూస్తే మతిపోతుంది!


రెనాల్ట్ ట్రైబర్‌ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే కారు పవర్‌ట్రెయిన్ 1.0-లీటర్ నాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. కారు ఇంజన్ గరిష్టంగా 71bhp పవర్‌, 96Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. కారు ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. రెనాల్ట్ ట్రైబర్‌లో లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 6 లక్షల నుండి రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కస్టమర్‌లు పొందుతారు. ఇది కాకుండా కస్టమర్‌లకు 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, AC వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, కార్ క్యాబిన్‌లోని సెంటర్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

Also Read: మారుతీ పిచ్చెక్కించే ఆఫర్లు.. సెలెరియోపై భారీ డిస్కౌంట్లు..!

అలానే సేఫ్టీ కోసం రెనాల్ట్ ట్రైబర్‌కు 4 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వెనుక పార్కింగ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇది బ్లాక్, లైట్ బ్రౌన్‌తో డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో వస్తుంది. డ్యాష్‌బోర్డ్ అదే డ్యూయల్-టోన్ థీమ్‌లో వస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ 8 వేరియంట్లతో రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×