BigTV English

Maruti Brezza Urbano Edition: బ్రెజ్జా నుంచి కొత్త ఎడిషన్.. మార్పులు చూస్తే మతిపోతుంది!

Maruti Brezza Urbano Edition: బ్రెజ్జా నుంచి కొత్త ఎడిషన్.. మార్పులు చూస్తే మతిపోతుంది!

Maruti Brezza Urbano Edition: మారుతి సుజుకి కంపెనీకి చెందిన బ్రెజ్జా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో నంబర్-1 SUVగా కొనసాగుతోంది. గత నెలలో దీన్ని 13,172 యూనిట్లు అమ్ముడయ్యాయి. దాని సెగ్మెంట్‌లో ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO కంటే చాలా ముందుంది. ఈ క్రమంలో ఇప్పుడు కంపెనీ తన అమ్మకాలను పెంచడానికి కొత్త అర్బానో ఎడిషన్ విడుదల చేసింది. Brezza లిమిటెడ్ ఎడిషన్ LXi, VXi వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎడిషన్‌లో కంపెనీ కొన్ని ప్రత్యేకమైన టూల్స్ అందిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.8.49 లక్షలు.


మారుతి బ్రెజ్జా అర్బానో ఎడిషన్ ధర బ్రెజ్జా అర్బానో ఎడిషన్ LXi (MT) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.49 లక్షలు. అదే సమయంలో దాని LXi CNG (MT) వేరియంట్ ధర రూ. 9.44 లక్షలు. దీని VXi (MT) వేరియంట్ ధర రూ. 9.84 లక్షలు. అర్బానో ఎడిషన్ VXi CNG (MT) వేరియంట్ ధర రూ.10.68 లక్షలు. దీని VXi (AT) వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు. కాగా, అర్బానో ఎడిషన్ LXi (MT) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.13 లక్షలు.

Maruti Brezza Urbano Edition
బ్రెజ్జా ఈ కొత్త ఎడిషన్‌‌లో ఇది కస్టమర్ మెటల్ సెల్ గార్డ్‌లు, 3డి ఫ్లోర్ మ్యాట్, నంబర్ ప్లేట్ ఫ్రేమ్ వంటి అప్‌డేట్‌లను అందిస్తోంది. డ్యాష్‌బోర్డ్‌లో కూడా కొన్ని అప్‌డేట్‌లు కనిపిస్తాయి. బ్రెజ్జా అర్బానో LXi వేరియంట్, VXi వేరియంట్‌లతో లభించే యుటిలిటీ యాక్సెసరీల ధరలు వరుసగా రూ. 42,000, రూ. 18,500 అదనంగా ఉంటాయి. ఈ టూల్స్ కారణంగా ఈ SUV ముందుకంటే కంటే మరింత లగ్జరీగా మారుతుంది.


Also Read: మారుతీ పిచ్చెక్కించే ఆఫర్లు.. సెలెరియోపై భారీ డిస్కౌంట్లు..!

మారుతి బ్రెజ్జా అర్బానో ఎడిషన్ ఇంజన్ మారుతి బ్రెజ్జా అర్బానో స్పెషల్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది 103bhp పవర్, 137Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. మారుతి బ్రెజ్జా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.15kmpl మైలేజీని, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 19.80kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఇది బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా అందుబాటులో ఉంది.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×